TGGENCO: జెన్‌కోలో కొలువులు ఇస్తలేరు
ABN, Publish Date - Dec 28 , 2024 | 03:46 AM
తెలంగాణ జెన్‌కోలో అసిస్టెంట్ ఇంజనీర్, కెమి్‌స్టల నియామకాలపై నిర్లక్ష్యం నెలకొంది. జెన్‌కోలో 339 అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ), 60 కెమిస్ట్ ఉద్యోగాల కోసం 2023 అక్టోబరులో నోటిఫికేషన్ వెలువడింది. మూడుసార్లు జాప్యం అనంతరం గత జూలై 14వ తేదీన రాత పరీక్ష జరిగింది.
సర్టిఫికెట్ల తనిఖీ పూర్తయి3 నెలలు అవుతున్నా జాప్యం
హైదరాబాద్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ జెన్‌కోలో అసిస్టెంట్ ఇంజనీర్, కెమి్‌స్టల నియామకాలపై నిర్లక్ష్యం నెలకొంది. జెన్‌కోలో 339 అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ), 60 కెమిస్ట్ ఉద్యోగాల కోసం 2023 అక్టోబరులో నోటిఫికేషన్ వెలువడింది. మూడుసార్లు జాప్యం అనంతరం గత జూలై 14వ తేదీన రాత పరీక్ష జరిగింది. గత సెప్టెంబరు 4వ తేదీన ఫలితాలు వెలువరించారు. అనంతరం సెప్టెంబరు 18వ తేదీ నుంచి 21వ తేదీ దాకా సర్టిఫికెట్ల తనిఖీ కూడా జరిగింది. అసలు ధ్రువపత్రాలు కూడా అధికారులు తీసుకున్నారు. చాలామంది అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు వదులుకొని... ఆయా సంస్థల నిరభ్యంతర పత్రాలు కూడా సమర్పించారు.
నియామక ప్రక్రియ వెనువెంటనే జర గాల్సి ఉండగా... అధికారుల నిర్లక్ష్యంతో మూడునెలలుగా అభ్యర్థులు విద్యుత్ సౌధ(జెన్‌కో ప్రధాన కార్యాలయం)తో పాటు సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. వాస్తవానికి యాదాద్రి పవర్ ప్లాంట్‌లో ఇప్పుడిప్పుడే కొత్త యూనిట్‌లలో విద్యుత్ ఉత్పాదన ప్రక్రియ ప్రారంభమయింది. కొత్తగా ఉద్యోగుల అవసరం ఉండగా... నియామక ప్రక్రియలో జాప్యం వెనుక కారణాలు బోధపడటం లేదు. జెన్‌కో సీఎండీ సందీ్‌పకుమార్ సుల్తానియాను ఐదుసార్లు కలిసి నివేదించినా ఫలితం లేకుండా పోయిందని అభ్యర్థులు వాపోతున్నారు. ఉప ముఖ్యమంత్రిని మూడుసార్లు కలిసినా ప్రయోజనం లేదని విచారం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు వదులుకొని వచ్చామని, నియామక పత్రాలు అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
Updated Date - Dec 28 , 2024 | 03:46 AM