ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Musi River: 15 వేల ఇళ్లు!

ABN, Publish Date - Sep 26 , 2024 | 02:52 AM

మూసీ పరీవాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న 15వేల కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

  • మూసీ నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను కేటాయిస్తూ జీవో జారీ

  • గ్రేటర్‌ పరిఽధిలోని మూసీ రివర్‌ బెడ్‌, బఫర్‌జోన్‌లోని

  • బాధితులకు మాత్రమేనని స్పష్టీకరణ

  • పునరావాసం తర్వాతే నిర్మాణాల తొలగింపు: దానకిశోర్‌

  • సర్వేకు వచ్చిన సిబ్బందిని అడ్డుకున్న నిర్వాసితులు

  • అమీన్‌పూర్‌లో హైడ్రా.. గోల్డెన్‌ కీ అపార్ట్‌మెంట్ల పరిశీలన

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, చాదర్‌ఘాట్‌, రాజేంద్రనగర్‌, పటాన్‌చెరు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మూసీ పరీవాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న 15వేల కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ సుందరీకరణ పనుల కోసం ఆ నదీ పరీవాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న వారిని ప్రభుత్వం అక్కడి నుంచి తరలించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటాయిస్తూ జీవో నంబర్‌ 754 జారీ చేసింది. అయితే జీహెచ్‌ఎంసీ పరిధిలోని మూసీ రివర్‌ బెడ్‌, బఫర్‌జోన్‌లో ఇళ్లు కోల్పోయిన నిరుపేద లే ఈ ఇళ్లకు అర్హులు అని జీవోలో స్పష్టం చేసింది. హౌజింగ్‌ కార్పొరేషన్‌, మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, ఆయా జిల్లాల కలెక్టర్లు గృహాల కేటాయింపు ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించింది.


మూసీనదిలో ఉన్న నిర్మాణాలకు సంబంధించి నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను కేటాయించిన తర్వాతే నిర్మాణాల తొలగింపు ప్రారంభమవుతుందని మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ దాన కిశోర్‌ స్పష్టం చేశారు. మూసీ సర్వేలో భాగంగా మూసీనది గర్భంలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి 2,166 నిర్మాణాలను గుర్తించారు. ఇందులో హైదరాబాద్‌ జిల్లాలో 1595, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 239, రంగారెడ్డి జిల్లాలో 332 ఉన్నట్లుగా తేల్చారు. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతంలో సర్వే చేసేందుకు బుధవారం ఎల్బీనగర్‌ అసెంబ్లీ పరిధిలోని కొత్తపేట, మారుతినగర్‌, సత్యానగర్‌ ప్రాంతాలకు ఉప్పల్‌ మండలం రెవెన్యూ సిబ్బంది వెళ్లగా మూసీ నిర్వాసితులు అడ్డుకున్నారు. తాము మూసీని నమ్ముకుని ఏళ్ల నుంచి నివాసముంటున్నామని, తమకు కనీస సౌకర్యాలు కల్పించకపోగా ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో నిర్మించుకున్న గుడిసెలు, చిన్నచిన్న ఇళ్లను కూల్చేందుకు వస్తారా? అంటూ పలువురు నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు.


తాము మూసీ పరీవాహక ప్రాంతంలోనే ఉన్నామని, తమ ఇళ్లు మూసీ సుందరీకరణకు ఏమాత్రం అడ్డంకి కాదంటూ రెవెన్యూ సిబ్బంది కారుకు అడ్డుగా నిల్చున్నారు. తాను ఇక్కడి ఇళ్లను ఖాళీ చేసి మరో ప్రాంతానికి తరలివెళ్లే పరిస్థితి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా రెవెన్యూ సిబ్బంది కారు దిగేందుకు వీలులేకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత కొత్తపేట సత్యానగర్‌లోని మరో చోటకు వెళ్లి డిజిటల్‌ సర్వే చేశారు. కాగా కొత్తపేట, మారుతినగర్‌, సత్యానగర్‌లోని మూసీ పరీవాహక ప్రాంతంలో సర్వే చేసి ఎన్ని ఇళ్లు ఉన్నాయో గుర్తించేందుకు వచ్చిన ఉప్పల్‌ మండల రెవెన్యూ సిబ్బందిని అడ్డుకోవడంతో పరివాహక ప్రాంతంలోని ఇళ్ల మార్కింగ్‌ పనులు కూడా నిలిపోయాయి. . కాగా మూసీ పరీవాహక ప్రాంతంలో 302 అక్రమ నిర్మాణాలున్నట్లు అధికారులు గుర్తించారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శశాంక పేర్కొన్నారు.


  • అమీన్‌పూర్‌లో అపార్ట్‌మెంట్లను పరిశీలించిన హైడ్రా

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మునిసిపాలిటీ పరిధిలోని సర్వే నంబరు 151, 152లోని వివాదాస్పద భూముల్లో నిర్మాణంలో ఉన్న ‘గోల్డెన్‌ కీ లాకీ’ అపార్ట్‌మెంట్లను హైడ్రా బృందం పరిశీలింది. సుమారు మూడెకరాల్లో హెచ్‌ఎండీఏ అనుమతితో కొనసాగుతున్న నిర్మాణాల్లో ఏ మేరకు అక్రమాలు ఉన్నాయన్న దానిపై నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. గతంలోనే సదరు నిర్మాణాలపై వెంకటరమణ కాలనీవాసులు హైడ్రాకు, సంంగారెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. కాగా వివాదాస్పదమైన సర్వేనెంబర్లలో సర్వేలు నిర్వహించి ముందు హద్దులు తేల్చాలని రంగనాథ్‌ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు సర్వే కొనసాగించి హద్దులను నిర్ణయించి నివేదికను హైడ్రా కమిషనర్‌కు అందజేశారు.

Updated Date - Sep 26 , 2024 | 02:52 AM