ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Indiramma Housing: ఇందిరమ్మ ఇంటికి.. 3 నమూనాలు!

ABN, Publish Date - Dec 06 , 2024 | 04:48 AM

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక సూచనలు చేసింది. ఇందిరమ్మ ఇంటికి సంబంఽధించి మూడు నమూనాలను ఖరారు చేసింది.

  • స్థలాన్ని బట్టి నిర్మించుకునేలా అవకాశం

  • సింగిల్‌, డబుల్‌ బెడ్‌రూమ్‌ల వారీగా డిజైన్లు

  • నమూనాలను ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక సూచనలు చేసింది. ఇందిరమ్మ ఇంటికి సంబంఽధించి మూడు నమూనాలను ఖరారు చేసింది. పథకం కింద ఇల్లు మంజూరైన వారు తమ అభిరుచికి అనుగుణంగానే ఇంటిని నిర్మించుకోవచ్చని చెప్పినా.. స్థలాన్ని బట్టి ఏ విధంగా ఇంటిని నిర్మించుకోవాలనే దానిపై డిజైన్లను రూపొందించింది. ఇంటి నిర్మాణంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నమూనాలను విడుదల చేసింది. ఈ మూడింటిలో స్థలాన్ని బట్టి గదులను ఎలా నిర్మించుకోవాలనే వివరాలను పొందుపర్చింది.


అంతేకాకుండా ప్రతీ మండల కేంద్రంలోనూ ఒక ఇంటిని ప్రభు త్వం ఏర్పాటు చేయనుంది. స్థలాన్ని బట్టి సింగిల్‌బెడ్‌ రూమ్‌, డబుల్‌ బెడ్‌ రూమ్‌, నిర్మించుకునే వెసులుబాటు కల్పించింది. అయితే, ఈ పథకానికి రూపొందించిన విధివిధానాల మేరకు ఇంటిని నిర్మించుకునే వారికి రూ.5 లక్షల చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందించనుంది. 400 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకున్న వారికి కూడా ఆర్ధిక సాయాన్ని అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.

Updated Date - Dec 06 , 2024 | 04:48 AM