విజయోత్సవాల్లో సారథి కళాకారుల ప్రదర్శనలు
ABN, Publish Date - Nov 21 , 2024 | 03:58 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నెల రోజులు పాటు నిర్వహించ తలపెట్టిన ప్రజాపాలన విజయోత్సవాలలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
హైదరాబాద్, నవంబర్ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నెల రోజులు పాటు నిర్వహించ తలపెట్టిన ప్రజాపాలన విజయోత్సవాలలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలపై విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి పాటల రూపంలో ప్రజలకు చేరువ చేసేందుకు కళాకారుల బృందాలు ప్రదర్శనలివ్వనున్నాయి.
విజయోత్సవాల సందర్భంగా నిర్వహించే సభలు, సమావేశాలకు ముందు ప్రదర్శనలు ఉండే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. డిసెంబర్ 10తేదీ వరకు సారథి కళాకారులు రోజుకు కనీసం మూడుచోట్ల ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఇప్పటికే సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో కళాకారులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. కాగా, ఇటీవలే తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా ప్రజాయుద్ధనౌక గద్దర్ కూతురు వెన్నెల నియమితులయ్యారు.
Updated Date - Nov 21 , 2024 | 03:58 AM