ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ‘హైడ్రా’కు 169 పోస్టుల మంజూరు..

ABN, Publish Date - Sep 26 , 2024 | 03:58 AM

చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ సంచలనంగా మారిన ‘హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా)’కు మొత్తం 169 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.

  • ఇందులో 113.. పోలీసు విభాగం పోస్టులే

  • డిప్యుటేషన్‌పై పోస్టుల భర్తీకి సర్కారు కసరత్తు

హైదరాబాద్‌ సిటీ/హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ సంచలనంగా మారిన ‘హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా)’కు మొత్తం 169 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. పోలీస్‌, ఇరిగేషన్‌, ఫైర్‌, ప్లానింగ్‌, రెవెన్యూ, ఆర్థిక, పీసీబీ, అటవీ శాఖల అధికారులను డిప్యుటేషన్‌పై హైడ్రాకు పంపనుంది. ఈమేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.


పోలీసు విభాగం నుంచి ఒక కమిషనర్‌ పోస్టు, రెండు అడిషనల్‌ కమిషనర్‌ పోస్టులతోపాటు డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ, ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్‌ వంటి 113 పోస్టులు కేటాయించా. వీటితోపాటు ఎనలిటికల్‌ ఆఫీసర్‌, ఫైర్‌ ఆఫీసర్‌, ప్లానర్లు, ఇంజనీర్లు, డిప్యూటీ కలెక్టర్‌, సర్వేయర్‌, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌, శాస్త్రవేత్త(పీసీబీ), పీఆర్‌వో వంటి పోస్టులు మంజూరు చేశారు.

Updated Date - Sep 26 , 2024 | 03:58 AM