ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gachibowli: మళ్లీ క్రీడా గ్రామంగా టిమ్స్‌

ABN, Publish Date - Nov 03 , 2024 | 04:13 AM

గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె స్‌ అండ్‌ రిసెర్చ్‌(టిమ్స్‌)ఆస్పత్రికి శాశ్వతంగా తాళం పడింది. ఆ భవనాన్ని మళ్లీ క్రీడాగ్రామం(స్పోర్ట్స్‌ విలేజ్‌)గా మార్చడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

ఆరోగ్య శాఖ నుంచి క్రీడాశాఖకు బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

  • 2002లో జాతీయ క్రీడలకు నెలవు

  • 2020 కొవిడ్‌ సమయంలో టిమ్స్‌గా రూపాంతరం

  • స్పోర్ట్‌ వర్సిటీ నేపథ్యంలో.. సర్కారు తాజా నిర్ణయం

హైదరాబాద్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె స్‌ అండ్‌ రిసెర్చ్‌(టిమ్స్‌)ఆస్పత్రికి శాశ్వతంగా తాళం పడింది. ఆ భవనాన్ని మళ్లీ క్రీడాగ్రామం(స్పోర్ట్స్‌ విలేజ్‌)గా మార్చడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది ఆగస్టులో గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఎన్‌ఎండీసీ మారథాన్‌ సందర్భంగా ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించగా.. ప్రభుత్వం తాజాగా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ’ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో.. టిమ్స్‌ ప్రాంగణాన్ని క్రీడాకారుల గురుకుల శిక్షణ శిబిరం, స్టేట్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా మార్చాలని స్పష్టం చేసింది.


  • 2002లో ప్రారంభమై..

గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియానికి అనుబంధంగా.. ఉమ్మడి ఏపీలో రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా మార్చాలనే లక్ష్యంతో అప్పటి సీఎం చంద్రబాబు 2002లో క్రీడాగ్రామాన్ని ప్రారంభించారు. 9.16 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన స్పోర్ట్స్‌ విలేజ్‌ భవనం(13 అంతస్తులు)లో 468 గదులున్నాయి. అదే సంవత్సరం జరిగిన జాతీయ క్రీడలకు ఉమ్మడి రాష్ట్రం ఆతిథ్యమివ్వగా.. హైదరాబాద్‌, విశాఖ నగరాల్లో క్రీడాపోటీలు జరిగాయి. వివిధ రాష్ట్రాల క్రీడాకారులకు నగరంలోని ప్రముఖ హోటళ్లతోపాటు.. క్రీడాగ్రామంలో వసతి కల్పించారు. 2003లో జరిగిన ఆఫ్రో-ఏషియన్‌ గేమ్స్‌ సందర్భంగా ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన క్రీడాకారులకు ఇక్కడ బస ఏర్పా టు చేశారు. ఈ స్టేడియంతోపాటు.. యూసు్‌ఫగూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియం, ఎల్‌బీ స్టేడియంలో క్రీడాపోటీలు జరిగాయి. 2007లో జరిగిన ప్రపంచ మిలటరీ క్రీడలకు కూడా గచ్చిబౌలి స్పోర్ట్స్‌ విలేజ్‌ ప్రధాన కేంద్రంగా నిలిచింది. కాగా, ప్రపంచ మిలటరీ క్రీడల తర్వాత స్పోర్ట్స్‌ విలేజ్‌ క్రమంగా ప్రభ కోల్పోయింది. 2020లో కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తుండడంతో.. రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్‌ విలేజ్‌ను 1,261 ఐసీయూ పడకలతో టిమ్స్‌గా మార్చింది. వెయ్యి మందికి పైగా సిబ్బందిని నియమించి, కొవిడ్‌ సమయంలో రోగులకు సేవలను అందించింది.


  • మళ్లీ క్రీడల కోసం..

ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో.. స్పోర్ట్స్‌ విలేజ్‌ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ(శాట్‌)కు అప్పగించనున్నారు. దాంతో అక్కడ యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ కోసం వినియోగించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లకు అవసరమైన గురుకుల శిక్షణ శిబిరాలను ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తాజా జీవోలో పేర్కొంది.

Updated Date - Nov 03 , 2024 | 04:13 AM