High Court: ‘ప్రత్యేక కమిషన్’పై సర్కారు అభ్యంతరం!
ABN, Publish Date - Nov 02 , 2024 | 04:47 AM
రాష్ట్రంలో కులగణన, రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియను ప్రత్యేక కమిషన్ ద్వారా చేపట్టే అంశాన్ని పరిశీలించాలన్న హైకోర్టు తీర్పుపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
హైకోర్టులో కౌంటర్ దాఖలుకు నిర్ణయం
కులగణనకు ప్రత్యేక కమిషన్ ఉండాలంటూ కృష్ణయ్య పిటిషన్.. పరిశీలించాలన్న హైకోర్టు
అడ్వకేట్ జనరల్‌తో చర్చిస్తున్న అధికార వర్గాలు
హైదరాబాద్, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కులగణన, రిజర్వేషన్లకు సంబంధించిన ప్రక్రియను ప్రత్యేక కమిషన్ ద్వారా చేపట్టే అంశాన్ని పరిశీలించాలన్న హైకోర్టు తీర్పుపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఈ నెల 21లోపు తెలియజేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కౌంటర్ ఎలా దాఖలు చేయాలన్న అంశంపై అడ్వకేట్ జనరల్‌తో ప్రభుత్వ వర్గాలు.. చర్చిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల అంశాన్ని తేల్చాలంటే కులగణన చేయాల్సి ఉంది.
ఈ క్రమంలోనే బీసీ కమిషన్‌ను నియమించిన ప్రభుత్వం.. కులగణనకు కూడా ఇదే కమిషన్ డెడికేటెడ్ కమిషన్‌గా ఉంటుందని జీవో 199లో పేర్కొంది. అయితే, ఈ అంశంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్ వేశారు. కులగణనకు డెడికేటెడ్ కమిషన్‌గా బీసీ కమిషన్నే గుర్తించడం సమంజసం కాదని, సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు పరిచేందుకు కొత్త డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించానలి హైకోర్టు పేర్కొనగా.. దీనిపై తన వాదనను వినిపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Updated Date - Nov 02 , 2024 | 04:47 AM