ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఖర్చు లేకుండా పూడికతీత!

ABN, Publish Date - Dec 26 , 2024 | 04:55 AM

రాష్ట్రంలోని రిజర్వాయర్లలో పేరుకుపోయిన పూడికను పైసా ఖర్చు లేకుండా తొలగించి, రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పూర్వ స్థాయికి చేర్చడంతోపాటు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • లోయర్‌ మానేరు, మిడ్‌ మానేరు, కడెం ప్రాజెక్టుల్లో చేపట్టాలని నిర్ణయం

  • టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం

  • నీటి అభివృద్ధి సంస్థ ఖాతాకు నిధుల జమ

హైదరాబాద్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రిజర్వాయర్లలో పేరుకుపోయిన పూడికను పైసా ఖర్చు లేకుండా తొలగించి, రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పూర్వ స్థాయికి చేర్చడంతోపాటు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వాయర్లలో పూడికను తీసే క్రమంలో ఇసుక లభిస్తే రూ.406.64కు(జీఎస్టీ, పర్మిట్‌ ఫీజు, సినరేజ్‌ అదనం) వసూలు చేయనుంది. తోడిన ఒండ్రు మట్టిని వాణిజ్య అవసరాలు ఇటుకల తయారీ, గుంత లు పూడ్చటం వంటి పనులకు వినియోగిస్తే... ఆ మట్టికి విడిగా ధరను ఖరారు చేయనుంది.. రైతులు తమ పొలాలకు తరలించాలనుకుంటే ఉచితంగా అందించనుంది. జాతీయ పూడికతీత పాలసీని అన్వయం చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ పాలసీపై మంత్రి వర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికను తెలంగాణ మంత్రి వర్గం ఆమోదించింది. దీనికి అనుగుణంగా లోయర్‌ మానేరు, మిడ్‌ మానేరుతోపాటు కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుల్లో పూడికతీత చేపట్టనున్నారు.


పూడికతీతతో వచ్చే నిధులను ప్రాజెక్టుల ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌(ఓ అండ్‌ఎం)కు వినియోగించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఈ నిధులను ప్రస్తుతానికి తెలంగాణ వాటర్‌ రిసోర్సెస్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(టీడబ్ల్యూఆర్‌డీసీ)లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లు పిలవాలని నీటిపారుదల శాఖను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. మహారాష్ట్ర, రాజస్థాన్‌లో ఫ్లోటింగ్‌ డ్రెడ్జింగ్‌(తేలియాడే పూడికతీత యంత్రం) తో పూడికను తీసి, మరో యంత్రం ద్వారా మట్టి, ఇసుకను వేరు చేస్తున్నారు. తెలంగాణలోనూ ఇదే విధానం అమలు కానుంది. తెలంగాణలో అమలు కానుంది. ఒండ్రు, బంకమట్టిని కేక్‌ల రూపంలో తయారు చేసి, ఇటుకల తయారీ పరిశ్రమలకు విక్రయించనున్నారు. రైతులకు ట్రాక్టర్ల ద్వారా మట్టిని సరఫరా చేయనున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో 20ఏళ్ల గడువుతో అక్కడి ప్రభుత్వాలు టెండర్లు పిలిచాయి. అంటే.. పూడికతీతతో 20 ఏళ్లపాటు ప్రభుత్వానికి ఆదాయం రానుంది.


పదేళ్లకు ఒకసారి అధ్యయనం

దేశవ్యాప్తంగా పదేళ్లకు ఒకసారి కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టుల నీటి నిల్వలపై హైడ్రోగ్రాఫిక్‌/బాతోమెట్రిక్‌ సర్వేలు చేయిస్తుంటాయి. తాజాగా జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టు(ఎన్‌హెచ్‌పీ)లో భాగంగా ప్రపంచబ్యాంకు నిధులతో తెలంగాణలోని పలు ప్రాజెక్టుల్లో పూడికపై అధ్యయనాలు జరగ్గా... అత్యధికంగా ర్యాలీ వాగు ప్రాజెక్టు 43.30 శాతం మేర సామర్థ్యం కోల్పోయినట్లు తేలింది. ఆ తర్వాత రామడుగు ప్రాజెక్టు 29.59 శాతం, జూరాల ప్రాజెక్టు 19.13 శాతం, ఎన్టీఆర్‌సాగర్‌ ప్రాజెక్టు 16.22 శాతం, మత్తడివాగు ప్రాజెక్టు 17.69 శాతం నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయినట్లు తేలింది. ఇక, శ్రీశైలం ప్రాజెక్టు సామర్థ్యం 29.96 శాతం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు సామర్థ్యం 23.52 శాతం మేర తగ్గింది. ప్రభుత్వం తాజాగా పూడికతీతపై మార్గదర్శకాలు సిద్ధం చేస్తుండగా... ఈ సమస్యకు స్వల్పంగానైనా పరిష్కారం లభించే అవకాశాలున్నాయి.


ఏటా తగ్గుతున్న సామర్థ్యం

తెలంగాణలో 929 టీఎంసీల సామర్థ్యం కలిగిన 159 రిజర్వాయర్లు ఉన్నాయి. రాష్ట్రంలో జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టు(ఎన్‌హెచ్‌పీ) కింద 220 టీఎంసీల సామర్థ్యం కలిగిన 14 ప్రాజెక్టుల్లో పూడికపై అధ్యయనం చేయించగా... ఈ ప్రాజెక్టులు 35 టీఎంసీల మేర సామర్థ్యం కోల్పోయినట్లు గుర్తించారు. వరదల సమయంలో వచ్చి చేరే పూడికతో ప్రాజెక్టుల సామర్థ్యం ఏయేటి కాయేడు గణనీయంగా తగ్గిపోతోంది. కేంద్రం లెక్కల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌ కట్టాలంటే భూసేకరణ, నిర్మాణ ఖర్చులు కలిపి రూ.162 కోట్లు ఖర్చవుతాయన్న అంచనాలున్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలో అధ్యయనం చేసిన జలాశయాలకు రూ.5,670 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లేనని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - Dec 26 , 2024 | 04:55 AM