ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Food Security: రేషన్‌కు 24 లక్షల టన్నుల సన్న బియ్యం!

ABN, Publish Date - Oct 17 , 2024 | 04:30 AM

వచ్చే జనవరి నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని భా విస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... తగినంత ధాన్యం సేకరించడంపై దృష్టి సారించింది.

  • ఇందుకు కావాల్సిన ధాన్యం 36 లక్షల టన్నులు

  • ఏడాది బియ్యం కోటా.. వానాకాలంలోనే సేకరణ

  • కార్యాచరణను సిద్ధం చేసిన పౌర సరఫరాల విభాగం

హైదరాబాద్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): వచ్చే జనవరి నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని భా విస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... తగినంత ధాన్యం సేకరించడంపై దృష్టి సారించింది. ఈ వానాకాలం సీజన్‌లో ఉత్పత్తి అయిన ధాన్యంతోనే ఏడాది కి సరిపడా బియ్యం నిల్వలు సిద్ధం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్ని టన్నుల బియ్యం కావాలి? ఎంత ధాన్యం సేకరించాలి? అనే అంశాలపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 90 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ప్రతి నెలా 2లక్షల టన్నుల చొప్పున ఏడాదికి 24 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ లెక్కన మొత్తం 36లక్షల టన్నుల సన్న ధాన్యం సేకరించాల్సి ఉంటుంది.


ప్రస్తుత వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 143 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఇందులో 80 లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు 45 లక్షల టన్నుల సన్న ధాన్యం, 35 లక్షల టన్నుల దొడ్డు ధాన్యం వచ్చే అవకాశం ఉంది. దొడ్డు ధాన్యం ఆడించడం ద్వారా వచ్చే బియ్యాన్ని యథావిధిగా భారత ఆహార సంస్థకు(ఎ్‌ఫసీఐ)కి అప్పగించాలని, సన్న ధాన్యాన్ని మాత్రం రాష్ట్ర ప్రజల ఆహార అవసరాలకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 ప్రోత్సాహకంతో కలిసి రూ.2,800 వరకు చెల్లించనుంది. సన్న ధాన్యం, దొడ్డు ధాన్యం కలవకుండా వేర్వేరుగా సేకరించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. వాస్తవానికి రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది.


ఈ నెలాఖరునాటికి వరి కోతలు, ధాన్యం సేకరణ పుంజుకోనున్నాయి. నవంబరు, డిసెంబరు నెలల్లో సేకరణ ప్రక్రియ జోరుగా సాగనుంది. అయితే, మార్కెట్‌ ధర బాగుంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు సన్న ధాన్యం తక్కువగా వస్తుందని, లేదంటే ఎక్కువగా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా 45 లక్షల టన్నులకు అటుఇటుగా సన్నధాన్యం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, సన్న బియ్యం పంపిణీకి 36లక్షల టన్నులు సరిపోయే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందీ ఉండదని చెబుతున్నారు. ఈ ప్రక్రియలో భారత ఆహార సంస్థ నిబంధనలనే మిల్లర్లకు వర్తింపజేయనున్నారు. వంద కిలోల ధాన్యం మిల్లర్లకు అప్పగిస్తే... 67 కిలోల బియ్యం ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది.


ఆ లెక్క ప్రకారం 36 లక్షల టన్నుల ధాన్యాన్ని ఆడిస్తే.. 24 లక్షల టన్నుల బియ్యం వస్తాయని, ఏడాది కోటాకు ఈ బియ్యం సరిపోతాయని ప్రణాళికలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ముడి బియ్యం ఉత్పత్తి చేసే రైస్‌ మిల్లులు 2 వేలకు పైచిలుకు ఉన్నాయి. ఇందులో పాత బకాయిలున్న మిల్లులను వదిలేసి... మిగిలిన వాటికి ధాన్యం కేటాయింపులు చేయనున్నారు. రెండు (నవంబరు, డిసెంబరు) నెలల్లో ధాన్యం సేకరణ, మిల్లర్లకు అప్పగింత, 67 శాతం లెక్కన బియ్యం తిరిగి తీసుకునే ప్రక్రియ మొత్తం పూర్తి చేసేలా పౌరసరఫరాల శాఖ ప్రణాళిక రూపొందించింది. యాసంగి సీజన్‌పై ఆధారపడకుండా... ఏడాదికి సరిపడా బియ్యం సేకరణ ఈ వానాకాలం ధాన్యంతోనే పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Oct 17 , 2024 | 04:30 AM