ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేటి నుంచి యాసంగికి నీటి విడుదల

ABN, Publish Date - Dec 13 , 2024 | 04:07 AM

నీటిపారుదల ప్రాజెక్టుల కింద యాసంగి (రబీ)లో 42.48 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): నీటిపారుదల ప్రాజెక్టుల కింద యాసంగి (రబీ)లో 42.48 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా శుక్రవారం నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి రబీ పంటలకు నీటిని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విడుదల చేయనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు నిజాంసాగర్‌ చేరుకోనున్న ఆయన... నీటిని విడుదల చేసిన అనంతరం.. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్నారు. అక్కడ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి, సమీక్ష చేపట్టనున్నారు. ఈ ఏడాది రబీలో ప్రాజెక్టుల కింద 17.94 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు, 24.54 లక్షల ఎకరాల్లో వరి పంటకు కలిపి.. 42.48 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. దీని కోసం 354.88 టీఎంసీలను విడుదల చేయనున్నారు.

Updated Date - Dec 13 , 2024 | 04:07 AM