ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Winter: వణికిస్తున్న చలి!

ABN, Publish Date - Dec 17 , 2024 | 04:57 AM

చలితో రాష్ట్ర ప్రజలు గజ.. గజ వణికిపోతున్నారు. సోమవారం ఆదిలాబాద్‌ జిల్లాలోని భీంపూర్‌ మండలం అర్లి(టి)లో అత్యల్పంగా 6.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

  • ఆదిలాబాద్‌ జిల్లా అర్లిలో 6.0 డిగ్రీల ఉష్ణోగ్రత

  • పఠాన్‌చెరులో 6.4 డిగ్రీలు నమోదు

  • చలి తీవ్రతకు దేవాలయ వాచ్‌మన్‌ మృతి

  • నల్లగొండ జిల్లాలో ఘటన

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): చలితో రాష్ట్ర ప్రజలు గజ.. గజ వణికిపోతున్నారు. సోమవారం ఆదిలాబాద్‌ జిల్లాలోని భీంపూర్‌ మండలం అర్లి(టి)లో అత్యల్పంగా 6.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా మారుమూల గ్రామాలను దట్టమైన పొగమంచు కప్పేయడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు హైదరాబాద్‌లోనూ చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం పఠాన్‌చెరులో అత్యల్పంగా 6.4 డిగ్రీలు, రాజేంద్రనగర్‌ 8.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో గ్రేటర్‌ పరిధిలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇవేనని హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజుల పాటు గ్రేటర్‌లో ఇదే తరహా పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించారు.


రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు, వికారాబాద్‌ జిల్లా బంట్వారంలో 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అటు సంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సోమవారం జహీరాబాద్‌ మండలం సత్వార్‌లో కనిష్ఠంగా 6.6 డిగ్రీలు నమోదైంది. దీంతో చలి తట్టుకోలేక ప్రజలు చలిమంటలు ఏర్పాటు చేసుకుంటున్నారు. కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆదివారం రాత్రి చలి తీవ్రతను తట్టుకోలేక నర్సింగ్‌ భట్ల గ్రామానికి చెందిన హనుమాన్‌ దేవాలయ వాచ్‌మన్‌ చింతకాయల సత్తయ్య మృతి చెందాడు. చిన్నపిల్లలు, సీనియర్‌ సిటిజన్లు చలిగాలుల బారిన పడకుండా ఉండేలా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Updated Date - Dec 17 , 2024 | 04:57 AM