Damodara: సర్కారీ ఆసుపత్రుల్లో మరమ్మతులపై దృష్టి
ABN, Publish Date - Dec 24 , 2024 | 03:55 AM
సర్కారీ ఆసుపత్రుల్లో మరమ్మతులపై వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ప్రాంతీయ ఆస్పత్రి వరకు, జిల్లా ఆస్పత్రి నుంచి బోధనాస్పత్రి వరకు రిపేర్లకు అయ్యే ఖర్చుల లెక్కలు తీయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
నిధుల కేటాయింపుపై కసరత్తు
నివేదికివ్వాలన్న మంత్రి దామోదర
హైదరాబాద్, డిసెంబరు23(ఆంధ్రజ్యోతి): సర్కారీ ఆసుపత్రుల్లో మరమ్మతులపై వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ప్రాంతీయ ఆస్పత్రి వరకు, జిల్లా ఆస్పత్రి నుంచి బోధనాస్పత్రి వరకు రిపేర్లకు అయ్యే ఖర్చుల లెక్కలు తీయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సోమవారం రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాఽఽధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రతీ ఆస్పత్రికి ఏడాదికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేయాలని, అందుకు వైద్యవిద్య సంచాలకులు, తెలంగాణ వైద్యవిధానపరిషత్ కమిషనర్, ప్రజారోగ్య సంచాలకులతో ఒక కమిటీ వేయాలని మంత్రి ఆదేశించారు. కమిటీ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి తమకు ఒక నివేదికివ్వాలని మంత్రి కోరారు.
వారిచ్చే నివేదిక ఆధారంగా ప్రతీ ఆస్పత్రికి నిర్వహణ వ్యయం కింద ఏడాదికి కొంత మొత్తాన్ని కేటాయించేందుకు వీలు కలుగుతుందని మంత్రి అధికారులకు సూచించారు. మరికొద్ది రోజుల్లో సాధారణ బడ్జెట్ ప్రతిపాదనలు పంపాల్సిన నేపథ్యంలో విభాగాధిపతుల వారీగా అంచనాలను ఇవ్వాలని మంత్రి కోరారు. అలాగే ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్స్ మార్గదర్శకాల మేరకు ప్రతి ఆస్పత్రిలో ఎంతమంది డాక్టర్లు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది ఉండాలో కూడా వివరాలను ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఐపీహెచ్‌ఎ్‌స గైడ్‌లైన్స్ ప్రకారం ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఎక్వి్‌పమెంట్, సిబ్బంది కొరత అలాగే, వైద్యుల కొరత రాకుండా ఉండేందుకు అవసరమయ్యే వివరాలను అందిస్తే మెడికల్ బోర్డు ద్వారా నియామకాలను చేపడతామని సూచించారు.
Updated Date - Dec 24 , 2024 | 03:55 AM