ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Damodara Rajanarasimha: వారం రోజుల్లో ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌

ABN, Publish Date - Sep 14 , 2024 | 03:25 AM

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సూచించారు.

  • వదంతులు నమ్మి విద్యార్థులు ఆందోళన చెందొద్దు

  • వెబ్‌ ఆప్షన్ల నమోదుకు సిద్ధంగా ఉండండి

  • వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా

హైదరాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సూచించారు. వారం రోజుల్లో కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుందని శనివారం ఓ ప్రకటన చేశారు. మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ ఇచ్చిన గడువులోగా కౌన్సెలింగ్‌ పూర్తి చేసి, సకాలంలో తరగతులను కూడా ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు. వైద్య విద్య ప్రవేశాల అంశంలో అసత్య ప్రచారాలు, వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని విద్యార్థులను కోరారు.


తెలంగాణ ప్రాంత విద్యార్థులకే సీట్లు దక్కాలన్నది తమ ఆలోచన అని, ఈ విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. వారం రోజుల్లో కౌన్సెలింగ్‌ ప్రారంభం అవుతుందని, ఈలోగా వెబ్‌ ఆప్షన్ల నమోదుకు విద్యార్థులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. శనివారం ఉదయం 11 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని సీట్ల వివరాలు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే, గతేడాది జరిగిన సీట్ల కేటాయింపు వివరాలను కూడా ర్యాంకుల వారీగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఆయా వివరాలను పరిశీలించి, తమ ర్యాంకులకు అనుగుణంగా వెబ్‌ ఆప్షన్ల కోసం జాబితాను సిద్థం చేసుకోవాలని విద్యార్థులకు మంత్రి సూచించారు.

Updated Date - Sep 14 , 2024 | 03:25 AM

Advertising
Advertising