Mini Degree: పట్టా కోసం డిగ్రీ.. పొట్టకూటి కోసం మినీ డిగ్రీ!
ABN, Publish Date - Sep 24 , 2024 | 02:41 AM
‘‘ప్రస్తుతం డిగ్రీలు పూర్తి చేసుకున్నవారు పట్టాలు మాత్రమే పొందుతున్నారు. పొట్టకూటి కోసం కావాల్సిన ఉద్యోగాలు మాత్రం సాధించలేకపోతున్నారు.
సరికొత్త కోర్సులను తెస్తున్న ప్రభుత్వం
విద్యార్థులకు ఉద్యోగం గ్యారంటీ
ఫైనాన్స్, బీమాలో నైపుణ్య శిక్షణ..
18 ఇంజనీరింగ్, 20 డిగ్రీ కాలేజీల్లో
10 వేల మంది విద్యార్థులకు ట్రైనింగ్
ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి
రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రస్తుతం డిగ్రీలు పూర్తి చేసుకున్నవారు పట్టాలు మాత్రమే పొందుతున్నారు. పొట్టకూటి కోసం కావాల్సిన ఉద్యోగాలు మాత్రం సాధించలేకపోతున్నారు. పరిశ్రమల అవసరాలకు సరిపడేలా నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగాలు సులభంగా సాధించవవచ్చు’’ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేపదే చెప్పే మాటలివి. ఈ దిశగా విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. డిగ్రీతోపాటు నైపుణ్యాలను పెంచుకునేందుకు ప్రత్యేకంగా మినీ డిగ్రీని కూడా ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో నైపుణ్య శిక్షణ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఇంజనీరింగ్ కాలేజీలు, 20 డిగ్రీ కాలేజీల్లో.. 10 వేల మంది విద్యార్థులకు ఈ కోర్సులను అందించనున్నారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవ తీసుకుని పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో దీనిని అమలు చేస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం (2024-25)నుంచే అందుబాటులోకి రానున్న ఈ కొత్త విద్యావిధానాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఐటీ, అనుబంధ రంగాల్లో నిపుణులకు ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. గత కొన్నేళ్లుగా హెచ్‌ఎ్‌సబీసీ, జేపీ మోర్గాన్, స్టేట్ స్ర్టీట్, మాస్ మ్యూచువల్, లండన్ స్టాక్ ఎక్స్చేంజీ వంటి బీఎ్‌ఫఎ్‌సఐ గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు దేశంలో దాదాపు 5 లక్షల ఉద్యోగాలు సృష్టించాయి. బీఎ్‌సఎ్‌ఫఐ రంగంలో పేరొందిన కంపెనీలన్నీ ఇప్పటికే హైదరాబాద్‌ను కీలకమైన వ్యాపార కేంద్రంగా గుర్తించాయి.
అందుకే కొత్తగా ఏర్పడే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు భారీగా ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఈ కోర్సులు భారీ ఖర్చులతో కూడుకున్నవి కావడంతో.. విద్యార్థులపై భారం పడకుండా కంపెనీలను భాగస్వామ్యం చేస్తోంది. కంపెనీల సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్) కార్యక్రమంలో భాగంగా వీటిని చేపట్టనుంది. యువతకు రెగ్యులర్ డిగ్రీతో పాటుగానే నైపుణ్య డిగ్రీ కోర్సును మినీ డిగ్రీ పేరుతో అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇటీవలే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎ్‌ఫఎ్‌సఐ) సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్‌గా అమలు..
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ మినీ డిగ్రీ ప్రోగ్రామ్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి డిజైన్ చేసింది. ఈ విద్యా సంవత్సరంలో 5వేల మంది ఇంజనీరింగ్, మరో 5వేల మంది ఇతర డిగ్రీ విద్యార్థులకు కలిపి.. మొత్తం 10 వేల మంది విద్యార్థులకు ఈ వర్క్ కోర్సు నేర్పిస్తారు. ఇప్పటికే వివిధ సంస్థలతో సంప్రదింపులు జరిపిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు.. ఈ ప్రోగ్రాం నిర్వహణకు ఇక్విప్ అనే సంస్థను ఖరారు చేశారు. తొలి విడతగా ఈ సంస్థ రూ.2.5 కోట్లను ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధపడింది. ప్రతి ఏటా 10 వేల మంది విద్యార్థులకు మూడేళ్లపాటు అవసరమయ్యే రివాల్వింగ్ ఫండ్‌ను ఈ సంస్థ సమీకరిస్తుంది.
కాగా, డిగ్రీ కాలేజీల్లో బీఎ్‌ఫఎ్‌సఐ కోర్సులో భాగంగా స్కిల్ ఎన్‌హాన్స్‌మెంట్ కోర్సు (ఎస్‌ఈసీ), జనరిక్ ఎలెక్టివ్స్ పాఠ్యాంశాలను పరిచయం చేస్తారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో దీనిని మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్‌గా, యాక్సిలరేటెడ్ కోర్సుగా అందిస్తారు. ఈ కోర్సులకు సంబంధించిన సిలబస్, పాఠ్యాంశాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఈ పాఠ్య ప్రణాళికను బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఆమోదించింది. డిగ్రీతోపాటు ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టా, ఇంటర్న్‌షి్‌పతోపాటు ఉద్యోగం లభించేలా ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించారు.
Updated Date - Sep 24 , 2024 | 02:41 AM