ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Medical Student: ఫిలిప్పైన్స్‌లో సంగారెడ్డి జిల్లా వైద్య విద్యార్థిని మృతి

ABN, Publish Date - Nov 16 , 2024 | 05:16 AM

ఫిలిప్పైన్స్‌లో రాష్ట్ర వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశానికి చెందిన సిగ్ధ. శుక్రవారం ఆమె పుట్టినరోజు.

  • పుట్టిన రోజునే అనంత లోకాలకు

  • అనుమానాస్పదంగా గదిలో మృత్యువాత

పటాన్‌చెరు, నవంబరు, 15 (ఆంధ్రజ్యోతి): ఫిలిప్పైన్స్‌లో రాష్ట్ర వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతురాలు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశానికి చెందిన సిగ్ధ. శుక్రవారం ఆమె పుట్టినరోజు. ఆ రోజు రాత్రి కొందరు స్నేహితులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆమె గదికి వెళ్లగా అప్పటికే విగతజీవిగా పడి ఉంది. అమృతరావు, అరుణ దంపతులకు స్నిగ్ధ ఏకైక కుమార్తె. అమృతరావు మెదక్‌లో ట్రాన్స్‌కో డీఈగా పనిచేస్తున్నారు. స్నిగ్ధ మనీలాలోని పర్ఫెక్చువల్‌ హెల్త్‌ యూనివర్సీటీలో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతోంది. చలనం లేని స్థితిలో ఉన్న స్నిగ్ధను గమనించిన స్నేహితులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.


ఆమె మృతిపై తల్లిదండ్రులకు సమాచారం అందడంతో వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇంద్రేశంలోని అమృతరావు ఇంటికి పెద్దఎత్తున బంధువులు, స్నేహితులు చేరుకుని వారిని ఓదార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గత మార్చిలో స్నిగ్ధ ఇంటికి వచ్చి నెలపాటు కుటుంబంతో సంతోషంగా గడిపి వెళ్లింది. ప్రతి రోజు తమతో మాట్లాడే బిడ్డ హఠాత్తుగా మృతి చెందడంపై అనుమానాలున్నాయని కుటుంబసభ్యులు తెలిపారు. ఒక్కగానొక్క కుమార్తెను డాక్టర్‌ను చేయాలని విదేశాలకు పంపిస్తే ఘోరం జరిగిపోయిందని అమృతరావు కంటికిమంటికీ ధారగా రోదించడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. తమ బిడ్డ మృతిపై ఫిలిఫ్పైన్స్‌ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి న్యాయం చేయాలని తండ్రి అమృతరావు కోరారు. మృతదేహాన్ని స్వదేశానికి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం సహకరించాలని కోరారు.

Updated Date - Nov 16 , 2024 | 05:16 AM