ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sridhar Babu: 2.22 లక్షల కోట్ల పెట్టుబడులు

ABN, Publish Date - Dec 06 , 2024 | 04:08 AM

కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన తర్వాత ఏడాది కాలంలో రాష్ట్రానికి రూ.2.22 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఒకే ఏడాది ఈ స్థాయి పెట్టుబడులు ఎప్పుడూ రాలేదని పేర్కొన్నారు.

  • రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ఘనత

  • మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు వెల్లడి

హైదరాబాద్‌, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన తర్వాత ఏడాది కాలంలో రాష్ట్రానికి రూ.2.22 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఒకే ఏడాది ఈ స్థాయి పెట్టుబడులు ఎప్పుడూ రాలేదని పేర్కొన్నారు. సచివాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించిన మంత్రి శ్రీధర్‌ బాబు.. ఐటీ, పరిశ్రమల శాఖ ప్రగతిని వివరించారు. 365 రోజుల్లో 2,783 పరిశ్రమలకు అనుమతులివ్వగా.. ఆ సంస్థలు రూ.2.22 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. వాటితో కొత్తగా 89,852 ఉద్యోగాలు సృష్టించామన్నారు.


రూ.200 కోట్లకు పైగా పెట్టుబడి, వెయ్యి మందికిపైగా ఉద్యోగాలిచ్చే మెగా ప్రాజెక్టులు 16 వచ్చాయని, రూ.14,433 కోట్లు పెట్టుబడులు పెట్టాయని వివరించారు. లైఫ్‌సైన్సెస్‌ రంగంలో 140 కంపెనీలు రూ.36వేల కోట్లు పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. ములుగు జిల్లా కమలాపూర్‌లో మూసివేసిన బిల్ట్‌ ఫ్యాక్టరీని తెరిపించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్యలో 10 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో ఎంఎ్‌సఎంఈలకు ఐదు, ఒకటి మహిళా పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తున్నామన్నారు. కాగా, యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ తాత్కాలిక క్యాంప్‌సలో జనవరిలో మరో ఏడు విభాగాల్లో 12 కోర్సులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.

Updated Date - Dec 06 , 2024 | 04:08 AM