Minority Women: 10,490 మంది మైనారిటీలకు కుట్టుమిషన్లు
ABN, Publish Date - Dec 17 , 2024 | 05:07 AM
మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలన్న లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 10,490 పేద మైనారిటీ మహిళలకు కుట్టుమిషన్లు అందజేయనున్నారు.
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన టీజీఎంఎ్‌ఫసీ
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలన్న లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 10,490 పేద మైనారిటీ మహిళలకు కుట్టుమిషన్లు అందజేయనున్నారు. ఇందిరమ్మ మహిళా శక్తి పథకంలో భాగంగా కుట్టు మిషన్లు అందిస్తామని తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీజీఈంఎ్‌ఫిసీ) చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్ తెలిపారు. ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆయన సోమవారం తన కార్యాలయంలో కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కాంతి వెస్లీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కోత్వాల్ మాట్లాడుతూ.. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేద ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్ మహిళలు ఈ పథకం దరఖాస్తుకు అర్హులన్నారు. అర్హత, ఆసక్తిగల ఆడపడుచులు అధికార వెబ్‌సైట్ gobmms.cgg.gov.in ఆన్‌లైన్లో ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Updated Date - Dec 17 , 2024 | 05:07 AM