ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Damodara Rajanarasimha: ఈ ఏడాదికి డిటెన్షన్‌ విధానం రద్దు!

ABN, Publish Date - Dec 17 , 2024 | 04:01 AM

ఉస్మానియా, జేఎన్‌టీయూ పరిధిలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో అమలవుతున్న డిటెన్షన్‌ విధానాన్ని ఈ ఏడాది (2024-25) అమ లు చేయబోమని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు.

  • ఓయూ, జేఎన్‌టీయూ పరిధిలోని ఇంజనీరింగ్‌ కాలేజీలతో త్వరలో భేటీ

  • సిలబస్‌, రీయింబర్స్‌మెంట్‌పై చర్చిస్తాం

  • శాసనసభలో మంత్రి దామోదర 2 వర్సిటీల్లో ఒకే విధానం ఉండాలి: ఒవైసీ

హైదరాబాద్‌, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా, జేఎన్‌టీయూ పరిధిలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో అమలవుతున్న డిటెన్షన్‌ విధానాన్ని ఈ ఏడాది (2024-25) అమ లు చేయబోమని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. రాష్ట్రంలో 40-50 ఏళ్ల నుంచి డిటెన్షన్‌ విధానం అమల్లో ఉందని గుర్తుచేశారు. అయితే రెండు వర్సిటీల్లో డిటెన్షన్‌ అమలుకు వేర్వేరు విధానాలు ఉండడంతో పాటు సిలబస్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి అంశాలపై చర్చించడానికి వీలుగా త్వరలోనే కాలేజీ యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఉస్మానియా వర్సిటీ పరిధిలో బీఈ విద్యార్థులకు డిటెన్షన్‌ విధానం అమలుపై మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ అడిగిన ప్రశ్నకు.. రాజనర్సింహ ఈ మేరకు జవాబు ఇచ్చారు.


కరోనా కారణంగా 2020-21, 2022-23 విద్యాసంవత్సరంలో డిటెన్షన్‌ విధానం నుంచి మినహాయింపు ఇచ్చామని, 2023-24 నుంచి మళ్లీ అమల్లోకి వచ్చిందని మంత్రి చెప్పారు. అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ.. జేఎన్‌టీయూలో పేపర్లలో కనీసం 25 శాతం ఉత్తీర్ణులైన, క్రెడిట్‌ స్కోర్‌ 25 ఉంటే ప్రమోట్‌/పాస్‌ చేస్తున్నారని, అదే ఓయూ పరిధిలో క్రెడిట్‌ స్కోర్‌ 50గా నిబంధన విధించారని చెప్పారు. రెండు వర్సిటీల పరిధిలో వేర్వేరుగా డిటెన్షన్‌ విధానం ఉండడంతో ఓయూ పరిధిలో ఇంజనీరింగ్‌ విద్యార్థులు డ్రాపౌట్లుగా మిగులుతున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని వర్సిటీల్లో డిటెన్షన్‌తోపాటు సిలబ్‌సను ఏకరూపంగా అమలు చేయాలన్నారు.

Updated Date - Dec 17 , 2024 | 04:01 AM