ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : ఎన్‌డీఎస్ఏ నివేదిక కోసం ఢిల్లీకి ఉత్తమ్‌

ABN, Publish Date - Sep 12 , 2024 | 03:20 AM

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) నివేదిక కోసం ఢిల్లీకి వెళ్లాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నిర్ణయించారు.

  • నాలుగో వారంలో పర్యటన

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) నివేదిక కోసం ఢిల్లీకి వెళ్లాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నిర్ణయించారు. వాస్తవానికి ఈనెల 17వ తేదీన పర్యటన ఖరారవ్వగా ఆ రోజు నుంచి 20వ తేదీ దాకా ఢిల్లీలో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఆధ్వర్యంలో 8వ ఇండియా వాటర్‌ వీక్‌ జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖతో పాటు ఎన్‌డీఎ్‌సఏ అధికారులు పాల్గొనే అవకాశం ఉండటంతో నాలుగో వారంలో ఢిల్లీకి వెళ్లడానికి మంత్రి సిద్ధమవుతున్నారు.


తుమ్మిడిహెట్టికి దిగువన ఒక రబ్బర్‌ డ్యామ్‌, వార్ధా ప్రాజెక్టులో మరో బ్యారేజీ కట్టి, అక్కడి నుంచి గ్రావిటీతో సుందిళ్లకు నీటిని తరలించాలని ప్రభుత్వం యోచిస్తోంది. లింక్‌- 1లో అన్నారం, మేడిగడ్డను వదిలేసి.. మిగతా కాంపోనెంట్లన్నీ యథాతథంగా వినియోగించుకోనుంది. ఈ నిర్ణయాల అమలు కోసం ఎన్‌డీఎ్‌సఏ నివేదికను ప్రామాణికంగా చేసుకుంది. దీనికోసం ఎన్‌డీఎ్‌సఏ చైర్మన్‌తో భేటీ కావాలని ఉత్తమ్‌ నిర్ణయించారు.

Updated Date - Sep 12 , 2024 | 03:20 AM

Advertising
Advertising