Share News

Ponguleti: పెండింగ్‌ బిల్లులు విడుదల చేయండి

ABN , Publish Date - Nov 30 , 2024 | 03:42 AM

ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులు, ఈహెచ్‌ఎ్‌స, జీవో 317, సీపీఎస్‌ వంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీజీవో ప్రతినిధులు శుక్రవారం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

Ponguleti: పెండింగ్‌ బిల్లులు విడుదల చేయండి

  • మంత్రి పొంగులేటికి టీజీవో వినతి

హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల పెండింగ్‌ బిల్లులు, ఈహెచ్‌ఎ్‌స, జీవో 317, సీపీఎస్‌ వంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీజీవో ప్రతినిధులు శుక్రవారం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివా్‌సరావు, ప్రధాన కార్యదర్శి ఎ. సత్యనారాయణ నేతృత్వంలో ఉద్యోగుల సమస్యలను మంత్రికి వివరించారు. అలాగే ఉద్యోగులకు రైతు రుణమాఫీ వర్తింపజేసే అంశాన్ని కూడా పరిశీలించాలని సీఎం రేవంత్‌ రెడ్డికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు లేఖ రాశారు. ప్రభుత్వంలో తక్కువ వేతనం పొందే ఉద్యోగులకు, అసిస్టెంట్‌ క్యాడర్‌, నాలుగో తరగతి ఉద్యోగులకు రుణమాఫీ పథకాన్ని అమలుచేయాలని కోరారు. అలాగే క్షేత్రస్థాయిలో పని చేసే ఉద్యోగులకు టోల్‌ ట్యాక్స్‌ మినహాయింపు కూడా ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు.

Updated Date - Nov 30 , 2024 | 03:42 AM