ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Burra Venkatesham: అభ్యర్థుల్లో విశ్వాసం పెంపొందిస్తా!

ABN, Publish Date - Dec 06 , 2024 | 03:03 AM

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) పట్ల అభ్యర్థుల్లో తిరిగి విశ్వాసం పెంపొందించేందుకు కృషి చేస్తానని కమిషన్‌ నూతన చైర్మన్‌ బుర్రా వెంకటేశం పేర్కొన్నారు.

  • యూపీఎస్సీ మాదిరిగా టీజీపీఎస్సీని తీర్చిదిద్దుతా

  • వేగంగా, పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ

  • టీజీపీఎస్సీ నూతన చైర్మన్‌ బుర్రా వెంకటేశం.. బాధ్యతల స్వీకరణ

హౖదరాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) పట్ల అభ్యర్థుల్లో తిరిగి విశ్వాసం పెంపొందించేందుకు కృషి చేస్తానని కమిషన్‌ నూతన చైర్మన్‌ బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. నాంపల్లిలోని కమిషన్‌ కార్యాలయంలో ఆయన గురువారం చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎప్పటికప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంతోపాటు భర్తీ ప్రక్రియను వేగంగా, పారదర్శకంగా చేపడతామని చెప్పారు. అభ్యర్థులు కమిషన్‌పై నమ్మకంతో పరీక్షలకు హాజరుకావాలని కోరారు. అభ్యర్థుల్లో టీజీపీఎస్సీ పట్ల తిరిగి పూర్తి నమ్మకం ఏర్పడే విధంగా కృషిచేస్తానని వెల్లడించారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (యూపీఎస్సీ) మాదిరిగా టీజీపీఎస్సీని తీర్చిదిద్దుతానని చెప్పారు. కష్టపడి పబ్లిక్‌ సర్వెంట్‌గా మారిన తాను.. నిరుద్యోగ అభ్యర్థుల కోసం మూడున్నరేళ్ల సర్వీసుని వదులుకుని ఈ బాధ్యతలు చేపట్టినట్టు తెలిపారు.


  • బుర్రా వెంకటేశం సేవలను కొనియాడిన గవర్నర్‌..

టీజీపీఎస్సీ చైౖర్మన్‌గా నియమితులైన బుర్రా వెంకటేశంకు రాజ్‌భవన్‌లో గురువారం ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత తొమ్మిది నెలల్లో ముఖ్య కార్యదర్శి హోదాలో వెంకటేశం అందించిన సేవలను గవర్నర్‌ కొనియాడారు. విధినిర్వహణలో అంకితభావం, నాయకత్వ లక్షణాలను రాజ్‌భవన్‌ సిబ్బంది ఎప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పారు.


  • విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఎన్‌.శ్రీధర్‌

విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఎన్‌.శ్రీధర్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. విద్యా శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ చైర్మన్‌గా వెళ్లడంతో ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌కు అదనపు బాధ్యతలుగా విద్యాశాఖను అప్పగించింది.

Updated Date - Dec 06 , 2024 | 03:03 AM