ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TGRTC: ఇంటికే ఆర్టీసీ కార్గో...

ABN, Publish Date - Oct 27 , 2024 | 04:12 AM

ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునే ప్రణాళికలో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎ్‌సఆర్టీసీ) వినియోగ దారుల ఇళ్ల వద్దకే లాజిస్టిక్స్‌ (కార్గో) సేవలను విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

  • హైదరాబాద్‌లో రేపటి నుంచి త్వరలో రాష్ట్రమంతా..: పొన్నం

  • హైదరాబాద్‌లో రేపటి నుంచి షురూ

  • త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా సేవలు

  • రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునే ప్రణాళికలో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎ్‌సఆర్టీసీ) వినియోగ దారుల ఇళ్ల వద్దకే లాజిస్టిక్స్‌ (కార్గో) సేవలను విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా దీన్ని మొదట ప్రయోగాత్మకంగా రాజధానిలో అమలు చేయనుంది. ఆదివారం (అక్టోబరు 27) నుంచి రాజధాని హైదరాబాద్‌లోని 31 కేంద్రాల నుంచి హోం డెలివరీ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.


ఆర్టీసీ లాజిస్టిక్స్‌ సెంటర్ల నుంచి హైదరాబాద్‌లో ఎక్కడికైనా హోం డెలివరీ చేయవచ్చని ఆయన విరించారు. రానున్న రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా ఈ విభాగాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలిపారు.

పార్శిళ్ల హోం డెలివరీ చార్జీలు ఇలా..

0 నుంచి 1 కేజీ పార్శిల్‌కు రూ.50

1.01 నుంచి 5 కేజీలకు రూ.60

5.01 నుంచి 10 కేజీలకు రూ.65

10.1 నుంచి 20 కేజీలకు రూ.70

20.1 నుంచి 30 కేజీలకు రూ.75

30.1 కేజీలు దాటితే.. పైన పేర్కొన్న

స్లాబ్‌ల ఆధారంగా ధరలు ఉంటాయి.

Updated Date - Oct 27 , 2024 | 04:12 AM