ఆరేళ్లు నిండితేనే ఒకటో తరగతిలో ప్రవేశంపై సవాల్
ABN , Publish Date - Apr 20 , 2024 | 11:21 AM
ఆరేళ్లు నిండిన తర్వాతే ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించాలన్న ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది.
- ఆ ఉత్తర్వులు చెల్లవంటూ హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ఆరేళ్లు నిండిన తర్వాతే ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించాలన్న ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. పిల్లలకు ఆరేళ్లు పూర్తయితేనే ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించాలంటూ ఇటీవల కేంద్రం జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్‌కు చెందిన పీ పరీక్షిత్‌రెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. ఎలాంటి శాస్ర్తీయ అధ్యయనం, పరిశోధన లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది.