Jubleehills: బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్.. టెకీ మృతి..
ABN, Publish Date - Jun 24 , 2024 | 05:16 AM
పెళ్లి చూపులకని వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ టెకీ దుర్మరణం పాలైన ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లికి చెందిన శివశంకర్ (30) మాదాపూర్‌లోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఘటన
మృతుడిది వనపర్తి జిల్లా..
బంజారాహిల్స్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): పెళ్లి చూపులకని వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ టెకీ దుర్మరణం పాలైన ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో చోటు చేసుకుంది. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లికి చెందిన శివశంకర్ (30) మాదాపూర్‌లోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. సంస్థకు సమీపంలోనే హాస్టల్‌లో ఉంటున్నాడు. అయితే అతడికి పెళ్లి సంబంధాలు చూస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఇంటికి రమ్మని చెప్పారు. ఈక్రమంలోనే శనివారం అర్ధరాత్రి తన బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు.
జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్-1 ఎవిస్ ఆస్పత్రి వద్దకు రాగానే అప్పుడే పెద్ద కంటైనర్ యూటర్న్ తీసుకుంటుండటంతో శివశంకర్ బైక్ వేగాన్ని తగ్గించాడు. ఇంతలో వెనుక నుంచి వచ్చిన ఓ టిప్పర్ బైక్‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఎగిరి కిందపడ్డ శివశంకర్ తలకు తీవ్ర గాయమైంది. అక్కడే ఉన్న మిగతా వాహనదారులు అంబులెన్స్‌తో పాటు పోలీసులకు సమాచారమిచ్చారు. 108 సిబ్బంది వచ్చి పరీక్షించగా.. శివశంకర్ అప్పటికే మృతి చెందాడు.
Updated Date - Jun 24 , 2024 | 05:16 AM