Chandrababu- Revanth Meeting: మళ్లీ కులుద్దాం.. అవ్వన్నీ తేల్చేద్దాం..!
ABN, Publish Date - Jul 06 , 2024 | 10:10 PM
ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశం ముగిసింది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా జరిగిన సమావేశంలో సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డితో పాటు.. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్థన్ రెడ్డి, కందుల దుర్గేష్ పాల్గొన్నారు.
ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశం ముగిసింది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా జరిగిన సమావేశంలో సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డితో పాటు.. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్థన్ రెడ్డి, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. సామరస్యపూర్వకంగా విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతూ.. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ముందుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. సమస్యల పరిష్కారం కోసం తొలివిడతలో ఉన్నతాధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో రాష్ట్రం నుంచి ముగ్గురు అధికారులను కమిటీలో ఉండనున్నారు. ఈ కమిటీ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనేందుకు మంత్రుల స్థాయిలో కమిటీ ఏర్పాటుచేయాలని.. ఈకమిటీ పరిష్కరించని సమస్యలపై చర్చించేందుకు మరోసారి ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనేక అంశాలపై చర్చించినప్పటికీ రెండు విధానపరమైన నిర్ణయాలను సమావేశంలో తీసుకున్నారు. విభజన సమస్యల పరిష్కారం కోసం అధికారులతో కూడిన ట్రీమెన్ కమిటీని.. డ్రగ్స్ రవాణ, సైబర్ నేరాల నియంత్రణకు రెండు రాష్ట్రాల అధికారులతో కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
Chandrababu- Revanth Meeting : సీఎం హోదాలో తొలిసారి కలిసిన ఇద్దరు నేతలు..!
ఫ్రెండ్లీగా..
రెండు రాష్ట్రాల మధ్య తలెత్తే సమస్యలను స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నిర్ణయించారు. రెండు రాష్ట్రాల ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్చల ద్వారా సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనాలని.. వివాదాలకు దూరంగా ఉండాలని ఈ సమావేశంలో చర్చించారు.
CMs Meet: తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీపై పెరిగిన ఉత్కంఠ..
చంద్రబాబుకు స్వాగతం..
ప్రజాభవన్‌కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు స్వాగతం పలికారు. ముందుగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పుష్పగుచ్చం అందించారు. ఆ తర్వాత కాళోజీ రచించిన ఇది నా గొడవ పుస్తకాన్ని సీఎం రేవంత్ చంద్రబాబుకు అందించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు సైతం రేవంత్, భట్టి విక్రమార్కను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. సమావేశం తర్వాత ఇద్దరు సీఎంలు, మంత్రులు కలిసి డిన్నర్ చేశారు.
CMs Meet: 5 గ్రామాలను కోరిన సీఎం రేవంత్
మరిన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More AP, Telangana News and Latest Telugu News
Updated Date - Jul 06 , 2024 | 10:10 PM