Warangal: అత్యాచారం కేసులో ముగ్గురి అరెస్ట్
ABN, Publish Date - Oct 05 , 2024 | 04:17 AM
వరంగల్‌కు చెందిన ఫార్మాడీ విద్యార్థిని అత్యాచారం కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్ శుక్రవారం వెల్లడించారు.
వరంగల్ ఫార్మా డీ విద్యార్థిపై అఘాయిత్యం ఘటనలో రిమాండ్
వరంగల్ చౌరస్తా, అక్టోబరు 4: వరంగల్‌కు చెందిన ఫార్మాడీ విద్యార్థిని అత్యాచారం కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్ శుక్రవారం వెల్లడించారు. భూపాలపల్లికి చెందిన తాటి శివరాజ్‌కుమార్ నర్సంపేటలోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్నాడు. అదే కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న కోడం వివేక్, గోదావరిఖనికి చెందిన కూచన మణిదీ్‌ప్, శివరాజ్‌కు స్నేహితులు. భూపాలపల్లికి చెందిన మరో స్నేహితుడి ద్వారా శివరాజ్‌కు బాధిత యువతితో మూడేళ్ల క్రితం పరిచయమైంది.
వరంగల్ శివారులోని ఓ కళాశాలలో ఫార్మాడీ చదువుతూ హాస్టల్‌లో ఉంటున్న బాధిత యువతిని శివరాజ్ ప్రేమించాడు. ఆమె ప్రేమను తిరస్కరించడంతో.. స్నేహితులుగా ఉందామని శివరాజ్ చెప్పాడు. స్నేహితుడినని బయటకు చెబుతున్నా ఆమెను ఎలాగైనా అనుభవించాలని అనుకున్నాడు. ఇందుకోసం మణిదీప్, వివేక్ సాయం కోరాడు. అయితే, తమకూ అవకాశం ఇవ్వాలని వాళ్లు అనడంతో రాజ్‌కుమార్ అంగీకరించాడు. సెప్టెంబరు 15న శివరాజ్ ఫోన్ చేసి భోజనం చేసి వద్దామని పిలవగా బాధిత యువతి సరేనంది. అయితే, మణిదీ్‌పకు చెందిన కారులో శివరాజ్‌కుమార్ ఆమె వద్దకు రాగా.. మణిదీప్, వివేక్ లోపల ఉండడాన్ని చూసిన బాధితురాలు వాహనం ఎక్కేందుకు నిరాకరించింది. అందరూ నచ్చజెప్పడంతో చివరికి కారు ఎక్కింది.
అనంతరం వరంగల్ పోచమ్మమైదాన్ సెంటర్‌లోని ఓ మద్యం దుకాణంలో మూడు బీర్లు కొనుగోలు చేసిన యువకులు.. యువతిని బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లారు. అక్కడ ఒకరి తర్వాత మరొకరు ఆమెపై అత్యాచారం చేశారు. యువతి కేకలు విన్న లాడ్జి సిబ్బంది.. వారిని పంపించారు. ఈ క్రమంలో అత్యాచారం విషయాన్ని బయటపెడితే రైలు కింద పడేసి చంపుతామని బాధితురాలిని ఆ ముగ్గురూ బెదిరించారు. అయితే, హాస్టల్‌కు చేరుకున్న బాధితురాలు పరీక్షలు ఉండడంతో కొద్ది రోజులు ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా దాచిపెట్టింది. పరీక్షల అనంతరం ఇంటికి చేరుకున్న బాధితురాలు జరిగిన దారుణాన్ని తల్లికి చెప్పగా అక్టోబరు 1న పోలీసులకు ఫిర్యాదు అందింది.
Updated Date - Oct 05 , 2024 | 04:17 AM