యాదాద్రి థర్మల్‌లో నేడు మహత్తర ఘట్టం
ABN , Publish Date - Sep 11 , 2024 | 06:13 AM
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో బుధవారం ముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తోన్న ఈ పవర్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండో యూనిట్‌ను బుధవారం సింక్రనైజేషన్
ప్లాంట్‌లోని ఒక యూనిట్ సింక్ర నైజేషన్
హాజరుకానున్న ఉప ముఖ్యమంత్రి, మంత్రులు
హైదరాబాద్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో బుధవారం ముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తోన్న ఈ పవర్ ప్లాంట్‌లో 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండో యూనిట్‌ను బుధవారం సింక్రనైజేషన్ చేయనున్నారు. దాదాపు 72 గంటల పాటు విద్యుత్ ఉత్పాదన చేసిన తర్వాత ప్లాంట్ కమిషన్ కానుంది. ఆ తర్వాత గ్రిడ్‌కు ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేసిన కరెంట్‌ను అందించనున్నారు. ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పాదన సజావుగా జరుగుతుందని నిర్ధారించుకున్న తర్వాత వాణిజ్య పరంగా ఉత్పత్తి చేయన్తున్నట్లు(సీవోడీ-కమర్షియల్ ఆపరేషన్ డేట్) ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ఒకేచోట 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్ ఇక్కడే ఉంది. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొననున్నారు. రెండో యూనిట్ సింక్రనైజేషన్ అనంతరం ప్లాంట్ నిర్మాణంపై సమీక్ష చేయనున్నారు.