ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mahesh Kumar Goud: ఫొటో షూట్‌ కోసమే కిషన్‌రెడ్డి మూసీ నిద్ర

ABN, Publish Date - Nov 18 , 2024 | 03:40 AM

ఫొటో షూట్‌ కోసమే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మూసీ నిద్రకు వెళ్లారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ విమర్శించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో 3 నెలలుంటే అక్కడి సమస్యలు తెలుస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి అంటే.. 12 గంటల ఉండి ఫొటో షూట్‌ చేసుకుని వచ్చారన్నారు.

  • సబర్మతీకో న్యాయం.. మూసీకి మరో న్యాయమా?: మహేశ్‌ గౌడ్‌

  • మహారాష్ట్రలో ఓట్ల కోసమే బీజేపీ మూసీ నిద్ర.. శ్రీధర్‌ బాబు ఫైర్‌

హైదరాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఫొటో షూట్‌ కోసమే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మూసీ నిద్రకు వెళ్లారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ విమర్శించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో 3 నెలలుంటే అక్కడి సమస్యలు తెలుస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి అంటే.. 12 గంటల ఉండి ఫొటో షూట్‌ చేసుకుని వచ్చారన్నారు. కిషన్‌రెడ్డి మూసీ నిద్రకు వెళ్లడానికి ముందే ఆ ప్రాంతంలో దోమలు, ఈగల మందు కొట్టారన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మహేశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. మూసీ పరీవాహక ప్రాంతాల్లో 3 నెలల పాటు ఉండి.. అక్కడి ప్రజలతో మూసీపే చర్చ కార్యక్రమం చేద్దాం రావాలంటూ కిషన్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. మూసీ నది ప్రక్షాళనకు ఒక న్యాయం.. సబర్మతీ రివర్‌ఫ్రంట్‌కు మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టును బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు కుమ్మక్కై ఆపే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. గుజరాత్‌ గులాంలా వ్యవహరిస్తూ తెలంగాణ అభివృద్ధికి ఎందుకు అడ్డుపడుతున్నారని కిషన్‌రెడ్డిని నిలదీశారు.


తెలంగాణ.. గుజరాత్‌ను ఎక్కడ దాటిపోతుందోనన్న భయం బీజేపీని వెంటాడుతోందని.. అందుకే ఈ కుట్రలని మండిపడ్డారు. లగచర్ల దాడి వెనుక కేటీఆర్‌ ఉన్నాడని స్పష్టం కావడంతోనే ఆ అంశాన్ని పక్కదారి మళ్లించేందుకే కిషన్‌రెడ్డి.. మూసీ నిద్ర కార్యక్రమాన్ని పెట్టుకున్నారని ఆరోపించారు. కాగా.. సోమవారం సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు ఆ జిల్లాకు మహేశ్‌గౌడ్‌ వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి తదితరులు పాల్గొననున్నారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రె్‌సపై నిందలు వేస్తే మహారాష్ట్రలో ఓట్లు వస్తాయని భావించి మూసీ నిద్రను బీజేపీ నేతలు ఎంచుకున్నారని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. మూసీ నిద్రకు వెళ్లి ఆలౌట్లు, మస్కిటో కాయిల్స్‌ పెట్టుకొని పడుకుంటారా అని ప్రశ్నించారు. మూసీ కాలుష్యంతో నల్లగొండ జిల్లా ప్రజలు, రైతుల పరిస్థితి చూసి.. ఆ తర్వాత మూసీ ప్రాజెక్టుపై మాట్లాడాలంటూ కిషన్‌రెడ్డికి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి సూచించారు. మహారాష్ట్రంలో బీజేపీకి బీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చి ఉండవచ్చునని, కానీ ఆ రాజకీయాలను ప్రజలపై రుద్దవద్దని హితవు పలికారు. ఫార్మా కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాలను కల్పిస్తామని, నష్ట పరిహారం ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా స్థానిక ప్రజలను బీఆర్‌ఎస్‌ నేతలు రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నారని ఎంపీ బలరాం నాయక్‌ అన్నారు.

Updated Date - Nov 18 , 2024 | 03:40 AM