ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mahesh Kumar Goud: కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లే కేసీఆర్‌, జగన్‌ అధికారం కోల్పోయారు!

ABN, Publish Date - Sep 22 , 2024 | 03:46 AM

పార్టీ కార్యకర్తలకు మంత్రులు అందుబాటులో ఉండాల్సిందేనని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ స్పష్టం చేశారు.

  • అందుకే కార్యకర్తలకు మంత్రులు అందుబాటులో ఉండాలి

  • జిల్లాలవారీ సమీక్షల్లో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ దిశానిర్దేశం

హైదరాబాద్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): పార్టీ కార్యకర్తలకు మంత్రులు అందుబాటులో ఉండాల్సిందేనని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ స్పష్టం చేశారు. జిల్లా పర్యటనలకు వెళ్లినప్పుడు విధిగా డీసీసీ కార్యాలయాలకు వెళ్లి కార్యకర్తలను కలిసి వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. పార్టీని, కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లే ఇక్కడ కేసీఆర్‌, ఏపీలో జగన్‌ అధికారాన్ని కోల్పోయారని పేర్కొన్నారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే జిల్లాలో ్లప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని మంత్రులకు సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అత్యధికం గా సీట్లు గెలుచుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అప్పుడే క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం అవుతుందన్నారు. ఇప్పటి నుంచే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలన్నారు.


పార్టీ పరిస్థితిపై ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షా కార్యక్రమాలు గాంధీభవన్‌లో శనివారం ప్రారంభమయ్యా యి. తొలి రోజు వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల సమీక్షలు జరిగాయి. మహేశ్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, ఆయా జిల్లాల ఇన్‌చార్జి మం త్రులు, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్‌ కుమార్‌గౌడ్‌ మాట్లాడారు. ప్రభుత్వ పథకాల కు సంబంధించి ప్రజల వరకు తీసుకెళ్లే బాధ్యత స్థానిక నేతలు, కార్యకర్తలు తీసుకోవాలన్నారు. విపక్షాల దుష్ప్రచారాన్నీ తిప్పి కొట్టాలన్నారు. కాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని భుజాన మోసిన తమకు అధికార, ఇతర కార్యాక్రమాల్లో ప్రాధాన్యం దక్కట్లేదని, బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన వారికే దక్కుతోందంటూ పలువురు నాయకులు మహేశ్‌ కుమార్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు.


దీనిపై ఆయ న స్పందిస్తూ కొత్త నాయకులు రాకుంటే పార్టీ బలోపేతం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కొత్త, పాత నాయకులు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. కష్టకాలంలో పార్టీని బతికించుకున్న నాయకులకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కాగా, టీపీసీసీ కొత్త చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను సీఎల్పీ ఆదివారం సన్మానించనుంది. కాగా మహేశ్‌గౌడ్‌కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య అభినందనలు గాంధీభవన్‌లో ఆయన్ను కలిసి సన్మానించారు.


  • అధికారులు.. మా మాట వినట్లేదు: ఎమ్మెల్యేల ఫిర్యాదు

తాము అధికారంలో ఉన్నామో, ప్రతిపక్షంలో ఉన్నామో అర్థం కావట్లేదని, జిల్ల్లాల్లో అధికారులు తమ మాట వినట్లేదని మంత్రి సురేఖ సహా పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు టీపీసీసీ చీఫ్‌కు ఫిర్యాదు చేశా రు. అధికారులు ఇంకా తాము పాత గవర్నమెంటులోనే ఉన్నామన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పా రు. ముఖ్యంగా పోలీస్‌ స్టేషన్లలో బీఆర్‌ఎస్‌ హ యాంలో వారు నియమించుకున్న అధికారులే కొనసాగుతున్నారని, వారు తమను లక్ష్యపెట్టట్లేదన్నా రు. ఈ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను ఇన్‌చార్జి మంత్రులకు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అప్పగించారు.

Updated Date - Sep 22 , 2024 | 06:21 AM