T. Jeevan Reddy: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్‌రెడ్డి!
ABN, Publish Date - Nov 29 , 2024 | 04:33 AM
నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి సభ్యుడి ఎన్నికల్లో సిటింగ్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని టీపీసీసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది.
నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ కాంగ్రెస్ ముఖ్య నాయకుల భేటీలో తీర్మానం
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి సభ్యుడి ఎన్నికల్లో సిటింగ్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని టీపీసీసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. వచ్చే మార్చితో గడువు ముగియనున్నందున ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయడానికి గురువారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీతో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, కొండా సురేఖ, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులందరూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తిరిగి జీవన్‌రెడ్డిని నిలబెట్టాలని తీర్మానం చేశారు.
Updated Date - Nov 29 , 2024 | 04:33 AM