Hyderabad: ఇంట్లో పాము ఉన్నట్లే.. దేశంలో అమిత్ షా
ABN, Publish Date - Jun 12 , 2024 | 02:15 PM
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. నిజమైన ప్రజా సేవకుడికి అహంకారం ఉండదంటూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీని ఉద్దేశించి చేసినవేనని అంతా భావిస్తున్నారన్నారు.
హైదరాబాద్, జూన్ 12: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. నిజమైన ప్రజా సేవకుడికి అహంకారం ఉండదంటూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీని ఉద్దేశించి చేసినవేనని అంతా భావిస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంతో సమాజంలో విద్వేషాలు పెరిగాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఈ సందర్బంగా గుర్తు చేశారు.
మోహన్ భగవత్ వ్యాఖ్యలపై బుధవారం గాంధీభవన్‌లో నిరంజన్ స్పందించారు. మణిపూర్ అల్లర్లపై భగవత్ చేసిన వ్యాఖ్యలు మోడీ వైఫల్యాలను బయట పెడుతున్నాయన్నారు. భవిష్యత్తులో బీజేపీలో జరగబోయే పరిణామాలకు భగవత్ చేసిన వ్యాఖ్యలు సాక్ష్యంగా నిలుస్తాయని చెప్పారు. అలాగే ఈ వ్యాఖ్యలు బీజేపీలో అంతర్గత విభేదాలకు అవకాశాలు కల్పిస్తున్నట్లుగా ఉన్నాయన్నారు. ఆయన వ్యాఖ్యలను గమనిస్తే.. నరేంద్ర మోదీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికయ్యే అవకాశం కూడా లేకుండా పోయేదని నిరంజన్ అభిప్రాయ పడ్డారు.
పాత వారికే పాత శాఖలు కేటాయించి.. మోదీ తన ఆశక్తతను ప్రకటించుకున్నారని విమర్శించారు. అయితే కేంద్ర హోం మంత్రి పదవి నుంచి అమిత్ షాను తప్పించాలని ప్రధాని మోదీని నిరంజన్ డిమాండ్ చేశారు. ఇంట్లో పాము ఉన్నట్లే అమిత్ షా దేశంలో హోం మంత్రిగా ఉన్నారన్నారు. మరోవైపు మోదీ ప్రభుత్వంలో ఏపీ సీఎం చంద్రబాబు, బిహార్ సీఎం నితీష్ కుమార్‌లు.. ఎక్కువ కాలం ఉండలేరని నిరంజన్ తెలిపారు.
Read Latest Andhra Pradesh News and Telugu News
Updated Date - Jun 12 , 2024 | 02:15 PM