ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Discoms: ఖరీదైన విద్యుత్తుకు స్వస్తి!

ABN, Publish Date - Sep 20 , 2024 | 04:54 AM

రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లు కరెంటు కొనుగోలు ఖర్చును తగ్గించుకుంటున్నాయి. ఖరీదైన విద్యుత్తుకు స్వస్తి పలుకుతున్నాయి.

  • నిరుడు కరెంటు కొనుగోళ్లకు రూ.53,373 కోట్లు

  • ఈ ఏడాది రూ.42,702 కోట్లుగా డిస్కమ్‌ల ప్రతిపాదన!

  • రూ.10 వేల కోట్ల ఖర్చు తగ్గింపు

  • విద్యుత్తు చార్జీల పెంపుతో 1200 కోట్ల అదనపు ఆదాయం

హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లు కరెంటు కొనుగోలు ఖర్చును తగ్గించుకుంటున్నాయి. ఖరీదైన విద్యుత్తుకు స్వస్తి పలుకుతున్నాయి. 2023-24లో కరెంట్‌ కొనుగోళ్లకు ఎస్పీడీసీఎల్‌ రూ.37,890.10 కోట్లు వెచ్చించగా.. ఎన్పీడీసీఎల్‌ రూ.15,483.73 కోట్లు ఖర్చు చేసింది. రెండు డిస్కమ్‌లు కలిపి రూ.53,373.83 కోట్లు వెచ్చించగా 2024-25లో రూ.10,671.83 తగ్గించి.. రూ.42,702 కోట్లే వెచ్చించనున్నట్లు ‘వార్షిక ఆదాయ అవసరాల (ఏఆర్‌ఆర్‌)’లో వెల్లడించాయి. జల విద్యుదుత్పాదనతో రూ.4వేలకోట్ల దాకా ఖర్చు తగ్గడంతో పాటు వ్యవసాయ, ఎత్తిపోతల పథకాలకు వినియోగం కూడా తక్కువ గా ఉంటుందన్న అంచనాతో విద్యుత్తు కొనుగోళ్ల ఖర్చు రూ.10,671.83 కోట్ల దాకా తగ్గుతుందని డిస్కమ్‌లు లెక్కించాయి.


2024-25లో విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం రూ.44,835 కోట్లు కాగా.. ఇందులో కొనుగోళ్లకే రూ.42,702 కోట్లు వెచ్చిం చాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. బుధవారంరాత్రి తెలంగాణ విద్యుత్తు నియం త్రణ మండలి (టీజీఈఆర్‌సీ)లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఏఆర్‌ఆర్‌ను డిస్కమ్‌లు దాఖలు చేశాయి. ఆ లెక్కల ప్రకారం 2024-25లో కొనుగోళ్లు, సరఫరా, స్టేట్‌ లోడ్‌డిస్పాచ్‌ సెంటర్‌(ఎస్‌ఎల్‌డీసీ)ఖర్చు, పంపిణీ ఖర్చులు మొత్తం రూ.57,857 కోట్లు అవుతాయని తేల్చాయి. ఇందులో ఆదాయం రూ.44,835 కోట్లు పోగా ప్రభుత్వ సబ్సిడీలు చేతికొస్తే లోటు ఉండదని అంచనా వేశాయి.


  • లోటు లేకుండా ఏఆర్‌ఆర్‌

పదేళ్లలో తొలిసారి లోటు లేకుండా డిస్కమ్‌లు ఏఆర్‌ఆర్‌ దాఖలు చేయడం గమనార్హం. 2024-25లో రూ.57,857 కోట్లు ఖర్చు కానుండగా.. అందులో ప్రభుత్వ సబ్సిడీ కలిపి, లోటు శూన్యస్థాయికి చేరింది. విద్యుత్తు చార్జీల పెంపుతో రూ.1200 కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటామని డిస్కమ్‌లు అంచనా వేశాయి. హెచ్‌టీ విభాగంలో చార్జీల పెంపుతో రూ.700 కోట్లు, ఫిక్స్‌డ్‌ చార్జీల పెంపుతో రూ.100 కోట్లు, మిగిలిన రూ.400 కోట్లను ఎల్టీ వినియోగదారుల ఫిక్స్‌డ్‌ చార్జీల పెంపు ద్వారా రాబట్టుకుంటామని తెలియజేశాయి.

Updated Date - Sep 20 , 2024 | 04:54 AM