ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tummala: రెండో స్థానం కోసం బీఆర్‌ఎస్‌, బీజేపీ పోటీ

ABN, Publish Date - Nov 16 , 2024 | 04:05 AM

రాష్ట్రంలో రెండో స్థానం కోసం బీఆర్‌ఎస్‌, బీజేపీ పోటీపడుతూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి తుమ్మల పుట్టినరోజు సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సచివాలయంలో శుక్రవారం ఆయన్ను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ధాన్యం కొనుగోళ్లపై దుష్ప్రచారం అందుకే.. వరి సాగు, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ టాప్‌

  • మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే రైతు భరోసా

  • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • కేటీఆర్‌ది దుర్మార్గపు రాజకీయం: మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండో స్థానం కోసం బీఆర్‌ఎస్‌, బీజేపీ పోటీపడుతూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంత్రి తుమ్మల పుట్టినరోజు సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సచివాలయంలో శుక్రవారం ఆయన్ను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇరువురు మంత్రులు విలేకరులతో మాట్లాడారు. రైతులను ఇబ్బంది పెట్టే రాజకీయ క్రీడను మానుకోవాలని బీఆర్‌ఎస్‌, బీజేపీలను ఈ సందర్భంగా మంత్రి తుమ్మల హెచ్చరించారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చివరి గింజ వరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు. వరి సాగు, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. 2023 వానాకాలంలో 65.94 లక్షల ఎకరాల్లో వరి సాగైతే... ఇప్పుడు అది 66.77 లక్షల ఎకరాలకు పెరిగిందని తెలిపారు. నిరుడు 146 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే ఈసారి అది 153 లక్షల టన్నులకు చేరిందని తెలిపారు. సన్నాల సాగు విస్తీర్ణం కూడా 25.05 లక్షల ఎకరాల నుంచి 40.44 లక్షల ఎకరాలకు చేరిందన్నారు.


కనీస మద్దతు ధర మీద రూ.500 బోనస్‌ ఇస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనతో సన్నాల సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. ఈ సీజన్‌లో నవంబరు 14 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 7,411 కొనుగోలు కేందాల్రు ద్వారా 1,41,377 మంది రైతుల నుంచి 9.58 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, అధికారం కోల్పోయి మతి భ్రమించిన బీఆర్‌ఎస్‌ నేతలు రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రెండో స్థానం కోసం పోటీ పడుతూ బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. ధాన్యం ఆరబెట్టిన చోటకు వెళ్లి ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్రంలో ధాన్యం సేకరణ జరుగుతోందని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరతోపాటు సన్నాలకు ప్రకటించిన బోన్‌సను కూడా ధాన్యం సేకరించిన వారం రోజుల్లోపే రైతుల ఖాతాల్లో జమచేస్తున్నట్లు తుమ్మల వెల్లడించారు. రైతు భరోసా పథకాన్ని తప్పనిసరిగా అమలుచేస్తామని చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే ఒక పంటకాలానికి ఎకరానికి రూ. 7,500 చొప్పున ఏడాదికి రూ. 15 వేలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. కాగా, బీఆర్‌ఎ్‌సలో ఆధిపత్య పోరు ఉండే అవకాశముందని తుమ్మల ఈ సందర్భంగా పేర్కొన్నారు.


  • ఏదోలా అరెస్టవ్వాలని కేటీఆర్‌ పాకులాట

ప్రజల్లో ఏదో ఒక రకంగా సానుభూతి పొందటం కోసం అరెస్టు అవ్వాలని మాజీ మంత్రి కేటీఆర్‌ పాకులాడుతున్నారని మంత్రి దుద్దిళ్ల శ్రీథర్‌బాబు అన్నారు. లగచర్ల ఘటనపై ఉన్నతస్థాయి అధికారితో విచారణ చేపడుతున్నామని, అమాయకులైన గిరిజన రైతులను అడ్డంపెట్టుకొని కేటీఆర్‌ దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ పాలనలో బలవంతంగా భూములు లాక్కున్న విషయాన్ని ప్రజలు మరిచిపోలేదని అన్నారు. రాష్ట్రం ప్రగతిపథంలో నడిచేందుకు పరిశ్రమలు అవసరమని, అప్పుడే నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులున్నా రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి కుట్రపన్నుతున్నాయని వ్యాఖ్యానించారు.

Updated Date - Nov 16 , 2024 | 04:05 AM