ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tummala : రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ విష ప్రచారం

ABN, Publish Date - Sep 09 , 2024 | 03:31 AM

గడిచిన పదేళ్లలో ఏ ఒక్క పథకాన్నీ సక్రమంగా అమలు చేయని పెద్దలు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి పది నెలలైనా గడవక ముందే మైకుల ముందుకొచ్చి గొంతు చించుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

  • రైతులను ఆందోళనకు గురిచేసే యత్నం

  • రుణమాఫీ, రైతు భరోసాపై స్పష్టమైన విధానంతో ప్రభుత్వం ముందుకెళుతోంది

  • ఒకే విడతలో 22లక్షల మందికి 18వేల కోట్ల మాఫీ చేసి మాట నిలబెట్టుకుంది

  • రైతులకు బీఆర్‌ఎస్‌ నాయకులు క్షమాపణ చెప్పి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి

  • వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్‌, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): గడిచిన పదేళ్లలో ఏ ఒక్క పథకాన్నీ సక్రమంగా అమలు చేయని పెద్దలు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి పది నెలలైనా గడవక ముందే మైకుల ముందుకొచ్చి గొంతు చించుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్‌ఎస్‌ నేతలపై మండిపడ్డారు. వారు రుణమాఫీపై విషప్రచారంతో రైతులను ఆందోళనకు గురిచేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులందరిదీ ఒకటే మాట అని, రుణమాఫీ, రైతు భరోసాపై స్పష్టమైన విధానంతో ముందకెళుతున్నామని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా లక్ష రూపాయల రుణమాఫీకి 4 వాయిదాలు తీసుకోలేదన్నారు.


తెలంగాణకు, ముఖ్యంగా రైతులకు ద్రోహం చేసిందెవరో, ఏ ఊరిలో ఏ గడపకెళ్లి అడిగినా తెలుస్తుందన్నారు. కర్రు కాల్చి వాత పెట్టినట్లు ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎ్‌సకు బుద్ధి చెప్పారని తుమ్మల పేర్కొన్నారు. కుటుంబం యూనిట్‌గా, రేషన్‌ కార్డును ప్రామాణికంగా తీసుకుని 2018లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 20.84 లక్షల మందికి రుణమాఫీ ఎగ్గొట్టిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. సగం మందికే చేసిన రుణమాఫీలో సైతం 2.26 లక్షల మందికి సంబంధించి రూ.1,419 కోట్లు తిరిగి ప్రభుత్వ ఖజానాకు వచ్చినా, వాటిని రైతులకు చెల్లించే ప్రయత్నం చేశారా అని నిలదీశారు. ఒకరిద్దరు కాదు, 2018లో రుణమాఫీ కాని 20 లక్షల మంది రైతుల పేర్లు ఇవ్వగలమని పేర్కొన్నారు.


గత ప్రభుత్వంలా ఐదేళ్ల పాటు సాగదీయలేమని, ఈ పంట కాలంలోనే రుణమాఫీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 కల్లా సరైన వివరాలున్న అన్ని ఖాతాలకు 2 లక్షల్లోపు రుణమాఫీ వర్తింపజేశామన్నారు. మొదటి పంటకాలంలోనే ఒకే విడతలో 22 లక్షల మందికి రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. కుటుంబ నిర్ధారణ కాని వారి వివరాలను వ్యవసాయాధికారులు సేకరిస్తున్నారని, ఇప్పటికే 2.65 లక్షల మంది వివరాలు ేసకరించారని పేర్కొన్నారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్‌ నాయకులు బుద్ధి తెచ్చుకొని, అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు. వడ్డీ మాఫీ చేయకుండా వదిలేసిన 22 లక్షల రైతు కుటుంబాల దగ్గరకు బీఆర్‌ఎస్‌ నాయకులు వెళ్లి క్షమాపణ అడిగి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని మంత్రి తుమ్మల హితవు చెప్పారు.


  • నేడు ఐఐహెచ్‌టీ ప్రారంభం

చేనేత రంగంలో నూతన పద్ధతుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని సోమవారం పబ్లిక్‌ గార్డెన్స్‌లోని లలిత కళాతోరణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి తుమ్మల తెలిపారు. నేతన్నకు చేయూత పథకం కింద 36,133 మందికి రూ.290కోట్లు సీఎం పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.

Updated Date - Sep 09 , 2024 | 03:31 AM

Advertising
Advertising