Tummla: దీక్షల పేరుతో బీజేపీ నేతల కొత్త డ్రామా!
ABN, Publish Date - Oct 04 , 2024 | 03:40 AM
రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన వివరాలు ఎప్పటికప్పుడు చెప్పినప్పటికీ రాష్ట్ర బీజేపీ నాయకులకు అర్థంకావటంలేదని, రైతులను గందరగోళపరిచి తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు దీక్షల పేరిట కొత్త డ్రామాకు
రుణమాఫీ లెక్కలపై స్పష్టత ఇచ్చినా వారికి అర్థంకావటంలేదు
మిగిలిన 20 లక్షల మంది రైతులకూమాఫీ చేస్తాం:తుమ్మల
హైదరాబాద్, ఆక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన వివరాలు ఎప్పటికప్పుడు చెప్పినప్పటికీ రాష్ట్ర బీజేపీ నాయకులకు అర్థంకావటంలేదని, రైతులను గందరగోళపరిచి తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు దీక్షల పేరిట కొత్త డ్రామాకు తెరతీశారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా రుణమాఫీ లెక్కలు చెప్పినా, రుణమాఫీ పథకం- 2024 పూర్తి అయినట్లు ప్రకటించకపోయినా.. మళ్లీ మళ్లీ అబద్ధాలు ప్రచారం చేస్తూ బీజేపీ ముఖ్యనేతలు తమ స్థాయిని దిగజార్చుకుంటున్నారని పేర్కొన్నారు. ‘నాకు మంత్రి పదవులు కొత్తకాదు. మంత్రి పదవి కోసమో, ఇతర పదవులకోసమో అశపడి ఏది పడితే అది మాట్లాడే నైజం నాదికాదు.
ఇప్పటికేౖనా బీజేపీ రాష్ట్ర నాయకులు నా గురించి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిందిగా సూచిస్తున్నా!’ అని ఓ ప్రకటనలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మొత్తం రైతుల సంఖ్య 65.56 లక్షలు ఉంటే... బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య 42 లక్షలుగా ఉన్నదని వెల్లడించారు. రూ. 2 లక్షలలోపు రుణాలు తీసుకుని కుటుంబ నిర్ధారణ పూర్తయిన22, 37, 848 రైతుకుటుంబాలకు రుణమాఫీ చేసినట్లు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి పంటకాలంలోనే రూ.2 లక్షలలోపు రుణాలను మాఫీ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మిగిలిన 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేేస బాధ్యత మా ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు.
Updated Date - Oct 04 , 2024 | 03:40 AM