ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Palamuru: కాంగ్రెస్‌తోనే రైతు రాజ్యం: తుమ్మల

ABN, Publish Date - Nov 29 , 2024 | 03:31 AM

కాంగ్రెస్‌ పార్టీతోనే రైతురాజ్యం సాధ్యమవుతుందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులకు పదేళ్ళలో బీఆర్‌ఎస్‌ పార్టీ చేయని మేలు, పది నెలల్లోనే కాంగ్రెస్‌ పార్టీ చేసి చూపిందని ఆయన చెప్పారు.

  • 30న రైతులకు మరో శుభవార్త: మంత్రి దామోదర

  • ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు: మంత్రి జూపల్లి

  • పాలమూరులో రైతు ఉత్సవాలు ప్రారంభం

మహబూబ్‌నగర్‌/ హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీతోనే రైతురాజ్యం సాధ్యమవుతుందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులకు పదేళ్ళలో బీఆర్‌ఎస్‌ పార్టీ చేయని మేలు, పది నెలల్లోనే కాంగ్రెస్‌ పార్టీ చేసి చూపిందని ఆయన చెప్పారు. పాలమూరులో మూడ్రోజులపాటు జరుగుతున్న రైతుపండగ కార్యక్రమాలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంత్రులు, తుమ్మల దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, జిల్లా ఎమ్మెల్యేలు కలిసి పద్మశ్రీ అవార్డు గ్రహీత రైతు చింతల వెంకట్‌రెడ్డితో రైతు పండగను ప్రారంభించారు. అనంతరం రైతులను ఉద్దేశించి తుమ్మల మాట్లాడుతూ, పరిస్థితుల ప్రభావంతో ప్రభుత్వం ఏదైనా చేయలేకపోతే రైతుల కాళ్ళు పట్టుకుంటాం, వారికే చెప్పుకుంటాం తప్పిస్తే.. ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదని అన్నారు. పాలమూరు రంగారెడ్డితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదని తుమ్మల స్పష్టం చేశారు.


అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, వ్యక్తుల కన్నా వ్యవస్థే శాశ్వతమని అన్నారు. 30న సీఎం రైతులకు మరిన్ని శుభవార్తలు చెప్పబోతున్నారని వెల్లడించారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రూ. 18 వేల కోట్ల రుణమాఫీతో పాటు సన్నధాన్యానికి బోనస్‌ ఇస్తున్నామని ఆయన గుర్తుచేశారు. అనంతరం పద్మశ్రీ అవార్డు గ్ర హీత చింతల వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, సేంద్రీయ వ్యవసాయంతో పెట్టుబడులు తగ్గి లాభాలు పెరుగుతాయన్నారు. రసాయనాలు వాడకం కన్నా సేంద్రీయ ఎరువులు వాడకం వల్ల అధిక దిగుబడి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన 150 వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ స్టాళ్ళను మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సందర్శించారు.


  • ఏం ఉద్ధరించారని రైతు ఉత్సవాలు: బీజేపీ

రైతులను ఏం ఉద్ధరించారని రైతు ఉత్సవాలు నిర్వహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ కాంగ్రెస్‌ పార్టీని ప్రశ్నించారు. వరంగల్‌ డిక్లరేషన్‌లో ఇచ్చిన 9 హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి విజయోత్సవాలు నిర్వహించుకునే అర్హత లేదని అన్నారు.

Updated Date - Nov 29 , 2024 | 03:31 AM