ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tummla Nageshwar Rao: పదేళ్లలో రైతుల గురించి కేటీఆర్‌ మాట్లాడారా?

ABN, Publish Date - Aug 22 , 2024 | 04:28 AM

‘అధికారంలో ఉన్న పదేళ్లలో రైతుల గురించి, వారి సమస్యల గురించి ఏనాడూ మాట్లాడని మాజీ మంత్రి కేటీఆర్‌ ఇప్పుడు రైతు రుణమాఫీపైనా, సీఎం రేవంత్‌రెడ్డిపైనా చీప్‌గా విమర్శలు చేస్తున్నారు.

  • చీప్‌గా మాట్లాడితే సీఎం కూడా అలాగే బదులిస్తారు

  • అర్హుడైన ప్రతి రైతుకూ రుణమాఫీ

  • ఫిర్యాదుదారుల ఇళ్లకు వెళ్లి సర్వే చేస్తాం: తుమ్మల

ఖమ్మం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘అధికారంలో ఉన్న పదేళ్లలో రైతుల గురించి, వారి సమస్యల గురించి ఏనాడూ మాట్లాడని మాజీ మంత్రి కేటీఆర్‌ ఇప్పుడు రైతు రుణమాఫీపైనా, సీఎం రేవంత్‌రెడ్డిపైనా చీప్‌గా విమర్శలు చేస్తున్నారు. వాళ్లు చీప్‌గా మాట్లాడడం వల్లనే సీఎం కూడా అదే తీరులో సమాధానం చెప్పాల్సి వస్తోంది’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రుణమాఫీపై అబద్ధాలు చెప్పే బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల మాటలు నమ్మి రైతులు ఆగం కావొద్దన్నారు.


అర్హత ఉన్న ప్రతి రైతుకూ రుణమాఫీ జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. రుణమాఫీ కాని రైతుల నుంచి ఫిర్యాదులు తీసుకుని ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించనున్నట్లు తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయనివారు అధికారం కోల్పోయిన తరువాత రైతులను ఆందోళనకు గురిచేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్నా ఏనాడు రైతులను పట్టించుకోకుండా పలు చట్టాల ద్వారా వారిని కష్టాల్లోకి నెట్టినవారు ఇప్పుడు రుణమాఫీపై విమర్శలు చేస్తున్నారన్నారు. వరంగల్‌ సభలో రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రూ.2లక్షల రుణమాపీకి కట్టుబడి 3 విడతలుగా ప్రభుత్వం రుణమాఫీ చేసిందని చెప్పారు.


మొదటి పంట కాలంలోనే రూ.31వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేయాలని నిర్ణయం తీసుకున్న ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదన్నారు. ఇప్పటి వరకు 22లక్షల ఖాతాల్లోకి రుణమాఫీ సొమ్ము జమైందని, కొన్ని బ్యాంకుల తప్పిదాలు, ఆధార్‌లో ఉన్న తప్పులు, బ్యాంకు అకౌంట్‌లో ఉన్న పేర్ల తప్పుల నేపథ్యంలో కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. ఆ రైతుల నుంచి ఫిర్యాదు తీసుకుని క్షేత్రస్థాయిలో వారి ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించి ఆ కుటుంబానికి రుణవిముక్తి జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. రేషన్‌కార్డు లేకపోయినా పట్టా పాసుపుస్తకం మీద రుణం తీసుకున్న రైతులు కుడా రుణమాఫీకి అర్హులని పేర్కొన్నారు.


గతంలో సాగుచేయని భూములకు కూడా పెట్టుబడి సొమ్ము ఇచ్చి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాకముందు కేవలం 39లక్షల మంది రైతుల పేర్లపైనే రుణాలున్నాయని, తాము అధికారంలోకి వచ్చాక గడిచిన ఐదేళ్లలో ఎంతమందికి పంట రుణాలుంటే అందరి ఖాతాలు పంపాలని కోరామని, దాంతో 41,78,892 లక్షల మంది రైతుల ఖాతాల వివరాలు బ్యాంకులు అందించాయని తెలిపారు. అయితే కొన్నిచోట్ల కిందిస్థాయి బ్రాంచీల్లో రైతుల వివరాలను రాష్ట్రస్థాయి బ్యాంకర్లకు పంపించలేదని, ఆ సమస్యను ఇప్పుడు కొత్తగా చెబుతున్నారన్నారు. అయినా వాటిని కూడా ఫిర్యాదులుగా స్వీకరించి అర్హత కలిగిన రైతులకు మాఫీ చేస్తామని ఆయన చెప్పారు.

Updated Date - Aug 22 , 2024 | 04:28 AM

Advertising
Advertising
<