Mahabubabad: విద్యుత్ శాఖలో ఉద్యోగం పేరిట వసూళ్లు
ABN, Publish Date - Dec 23 , 2024 | 04:58 AM
విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 15 మంది దగ్గరి నుంచి రూ.1.76 కోట్లు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య ఆదివారం తెలిపారు.
15 మంది నుంచి రూ.1.76 కోట్లు వసూలు.. ఇద్దరి అరెస్టు
రూ.2.50 లక్షలు తీసుకొని మహిళకు నకిలీ అపాయింట్‌మెంట్
మహబూబాబాద్ రూరల్/నర్సంపేట టౌన్, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 15 మంది దగ్గరి నుంచి రూ.1.76 కోట్లు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య ఆదివారం తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మొగిలిచర్లకు చెందిన నాగేశ్వర్‌రావు, హన్మకొండ జిల్లా పత్తిపాకకు చెందిన సహోదర్‌రెడ్డి.. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మహబూబాబాద్ టౌన్, రూరల్, కురవి, బయ్యారం పోలీ్‌సస్టేషన్ల పరిధిలో 15 మంది వ్యక్తుల వద్ద నుంచి రెండేళ్ల క్రితం రూ.1.76 కోట్లు వసూలు చేశారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్నారు.
దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఘటనలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ.2.50 లక్షలు వసూలు చేసి ఓ మహిళను మోసగించిన సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆలస్యంగా వెలుగు చూసింది. నర్సంపేటకు చెందిన శృతి నుంచి వావిళ్ల ప్రసాద్ అనే వ్యక్తి ఏడాది క్రితం రూ.2.50లక్షలు తీసుకున్నాడు. 2023 అక్టోబరు 28న ఓ అపాయింట్‌మెంట్ లెటర్‌ను ఇచ్చాడు. దాన్ని తీసుకొని ఆమె సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లగా అది నకిలీదని తేలడంతో బాధితురాలు నిందితుడిని నిలదీసింది. నవంబరు 12న పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా న్యాయం జరగలేదని ఆదివారం విలేకరుల వద్ద గోడు వెళ్లబోసుకొంది.
Updated Date - Dec 23 , 2024 | 04:58 AM