Hyderabad: ఉమామహేశ్వర్‌రావు కేసు.. కీలకంగా డైరీ..!
ABN, Publish Date - May 30 , 2024 | 03:01 AM
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు కేసులో.. ఆయన ఇంట్లో దొరికిన డైరీ కీలకంగా మారుతున్నట్లు తెలిసింది. మూడ్రోజుల కస్టడీకి నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు అనుమతించడంతో.. బుధవారం ఉదయం ఏసీపీని చంచల్‌గూడ జైలు నుంచి ఏసీబీ కార్యాలయానికి తరలించారు.
50 మందితో నెట్‌వర్క్ మూడ్రోజులపాటు
ఏసీబీ కస్టడీకి ఏసీపీ పోలీసులు, వ్యాపారులు,
నేతలతో కోట్లలో పెట్టుబడి పెట్టించిన ఏసీపీ?
వ్యాపారులతో.. రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టించిన ఏసీపీ?
హైదరాబాద్ సిటీ, మే 29 (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు కేసులో.. ఆయన ఇంట్లో దొరికిన డైరీ కీలకంగా మారుతున్నట్లు తెలిసింది. మూడ్రోజుల కస్టడీకి నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు అనుమతించడంతో.. బుధవారం ఉదయం ఏసీపీని చంచల్‌గూడ జైలు నుంచి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. తొలిరోజు ఆ డైరీలో ఉన్న వ్యక్తుల పేర్లు, వారితో లావాదేవీలు, అందులో ఉన్న కోడ్ భాషపై ప్రశ్నించినట్లు తెలిసింది. ఆయన వ్యక్తిగత ల్యాప్‌ట్యా్‌పను కూడా ఏసీబీ అధికారులు విశ్లేషిస్తున్నట్లు సమాచారం. ఉమామహేశ్వర్‌రావు డైరీలో.. పెట్టుబడులు, భాగస్వాములు, తనకు సహకరిస్తున్న పోలీసులు.. ఇలా పలు వివరాలను రాసిపెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఆ డైరీలో సందీప్ అనే పేరున్న వ్యక్తిని ఓ ఇన్వెస్టర్‌గా గుర్తించారు. దీంతో.. సందీ్‌ప-ఉమామహేశ్వర్‌రావు కలిసి ఏమైనా పెట్టుబడులు పెట్టారా? వ్యాపారాలున్నాయా? అనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు.. సుమారు 50 మందితో ఏసీపీ ఉమామహేశ్వరరావు తన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు సమాచారం. వారిలో పోలీసులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, బడాబాబులు ఉన్నట్లు అధికారులు తెలిసింది. వారితో ఏసీపీ పెట్టుబడులు పెట్టించినట్లు సమాచారం. ఉమామహేశ్వర్‌రావు కస్టడీ ముగిశాక.. వారికి నోటీసులు ఇచ్చి, విచారించే అవకాశాలున్నాయి.
ఆస్తులపై ఆరా..
ఈ నెల 21న ఉమామహేశ్వర్‌రావు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అతని బంధుమిత్రుల ఇళ్లలో తనిఖీలు జరిగిన విషయం తెలిసిందే..! ఆ సందర్భంగా రూ.3.95 కోట్ల విలువైన స్థిరచరాస్తులను ఏసీబీ సీజ్ చేసింది. తొలిరోజు కస్టడీలో ఈ ఆస్తులకు సంబంధించి ఉమామహేశ్వర్‌రావును ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ ఆస్తులను కూడబెట్టుకోవడానికి నిధులెక్కడివి?ఎలా సంపాదించా రు? అనే అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దాంతోపాటు.. రూ.1800 కోట్ల మోసానికి సంబంధించిన సాహితీ ఇన్‌ఫ్రా కేసులో వచ్చిన ఆరోపణలపైనా ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.
Updated Date - May 30 , 2024 | 03:01 AM