ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vikarabad: అకాల వర్షం.. తడిసిన ధాన్యం..

ABN, Publish Date - Dec 08 , 2024 | 03:39 AM

వికారాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం అకస్మాత్తుగా కురిసిన వర్షం రైతులను కన్నీరు పెట్టించింది. పలు ప్రాంతాల్లో ఆరబోసిన ధాన్యం అకాల వర్షం దెబ్బకు తడిచిపోయింది. ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు నానావస్థలు పడ్డారు.

  • వికారాబాద్‌ జిల్లాలో రైతులకు ఊహించని కష్టం

కొడంగల్‌ రూరల్‌/యాలాల/ ఆమనగల్లు, జమ్మికుంట, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం అకస్మాత్తుగా కురిసిన వర్షం రైతులను కన్నీరు పెట్టించింది. పలు ప్రాంతాల్లో ఆరబోసిన ధాన్యం అకాల వర్షం దెబ్బకు తడిచిపోయింది. ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు నానావస్థలు పడ్డారు. వికారాబాద్‌ జిల్లాలోని మహబూబ్‌నగర్‌- చించోలి హైవేపై శనివారం 12గంటల సమయంలో ఒక్కసారిగా వర్షం కురిసింది. దీంతో ఆ రహదారిపై రైతులు ఆరబోసిన ధాన్యం తడిచిపోయింది. అలాగే, యాలాల మండలంలో తేలికపాటి వర్షం కురవగా.. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలపై టార్పాలిన్లు కప్పేందుకు రైతులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఆమనగల్లులో శనివారం సాయంత్రం భారీ వర్షం కురవగా.. మార్కెట్‌ యార్డులో విక్రయానికి రైతులు తెచ్చిన ధాన్యం తడిసింది. రెండు, మూడు రోజులుగా కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఇక్కడ ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి.


ఈ క్రమంలో అకాల వర్షం నష్టం కలిగించింది. ఇక, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురవగా పాత వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పోసిన ధాన్యం కొట్టుకుపోయింది. ఆబాది జమ్మికుంటకు చెందిన జక్కె సంపత్‌ అనే రైతు పది రోజుల క్రితం 30క్వింటాళ్ల ధాన్యం తీసుకురాగా తేమ ఉందని అధికారులు కాంటా పెట్టలేదు. దీంతో మార్కెట్‌ యార్డులో ధాన్యం కుప్పలు పోశాడు. శనివారం కురిసిన వర్షానికి ఆ ధాన్యం కొట్టుకుపోయింది. మరికొందరు రైతులకు చెందిన ధాన్యం కూడా తడిచిపోయింది. కాగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ఆదివారానికి బలపడనుందని, ఈ ప్రభావంతో 11వ తేదీ నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

Updated Date - Dec 08 , 2024 | 03:39 AM