Kishan Reddy: ప్రధాని మోదీ తల్లి పేరుతో ప్రతి ఒక్కరు ఓ చెట్టు నాటండి
ABN , Publish Date - Oct 02 , 2024 | 07:51 PM
కాలుష్యం.. మానవాళికి ప్రమాదకరంగా మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో సామాజిక స్పృహ పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి వ్యక్తికి సామాజిక భాధ్యత తప్పని సరిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. దశాబ్దం క్రితం గాంధీ జయంతి రోజునే మోడీ స్వచ్చా భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గుర్తు చేశారు.
హైదారబాద్, అక్టోబర్ 02: దేశంలోని ప్రతి ఒక్కరికి ఎన్విరాన్‌మెంట్‌పై అవగాహన రావాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ఎన్విరాన్‌మెంట్‌పై ప్రముఖ మాటల రచయిత, దర్శకుడు కూన వెంకట్ తీసిన షార్ట్ ఫిల్మ్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారం నగరంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ షార్ట్ ఫిలిం చాలా సందేశాత్మకంగా ఉందన్నారు.
Also Read: Kolkata: ర్యాలీలో కశ్మీర్ ఆజాదీ నినాదాలు.. మమత ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్రం
సామాజిక స్పృహ సూర్ఫితో చాలా చక్కగా ఈ షార్ట్ ఫిలిం తీసిన కోన వెంకట్‌కు ఈ సందర్భంగా ఆయన మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ షార్ట్ ఫిలిం చాలా అద్భుతంగా రూపొందించారంటూ కోన వెంకట్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు.
Also Read: భారతీయులు జాగ్రత్త.. అప్రమత్తమైన కేంద్రం..
Also Read: అక్టోబర్ 2: భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి
ఇటువంటి అవగాహన ప్రతి ఒక్కరిలో రావాలన్నారు. స్వచ్ఛ కార్యక్రమం వంటి కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్విరాన్‌మెంట్‌పై ఈ తరహా ఫిలిమ్స్ అనేకం రావాల్సి ఉందన్నారు. తద్వారా ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించ వచ్చని తెలిపారు. అనేక సామాజిక సినిమాలు తీసి ప్రేక్షకుల మన్ననలు పొందిన వ్యక్తి కొన వెంకట్ అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ రోజు కూన వెంకట్ పార్టీ కార్యాలయానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
Also Read: Arvind Kejriwal: కొత్త ఇంటికి మారనున్న కేజ్రీవాల్
కాలుష్యం.. మానవాళికి ప్రమాదకరంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో సామాజిక స్పృహ పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి వ్యక్తికి సామాజిక భాధ్యత తప్పని సరిగా ఉండాలని స్పష్టం చేశారు. దశాబ్దం క్రితం గాంధీ జయంతి రోజునే మోడీ స్వచ్చా భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
Also Read: Arunachalam Tour: దసరా వేళ అరుణాచలేశ్వరుడి దర్శనం.. తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ
ఇక థర్మల్ పవర్ ద్వారా ఉత్పత్తి అవుతున్న వస్తువులను నిషేధించే పనిలో ప్రపంచ దేశాలు ఉన్నాయన్నారు. రానున్న రోజుల్లో మన దేశానికి థర్మల్ పవర్ అంశం ఒక చాలెంజ్‌గా మారనుందని పేర్కొన్నారు. దేశంలో 85 శాతం బొగ్గు ఆధారిత విద్యుత్ సరఫరా అవుతుందని తెలిపారు. అయితే రానున్న రోజుల్లో పునరుత్పాదక ఇంధనం (రెనోబుల్ ఎనర్జీ)కి మారాల్సి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తనతో పేర్కొన్నారని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.
Also Read: Dussehra Holidays 2024: దసర వేడుకలు చూడాలంటే.. ఈ నగరాలకు వెళ్లాల్సిందే..
విద్యుత్ ఉపయోగం విచ్చలవిడిగా జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్విరాన్‌మెంటల్ లాస్, ఎనర్జీ లాస్, గ్రీనరీ లాస్, వాటర్ లాస్ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్విరాన్‌మెంట్‌లో భాగంగా ప్రధాని మోదీ తల్లి పేరు మీద ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పిలుపు నిచ్చారు. ప్రకృతి కాపాడటం ప్రతి ఒక్కరి భాద్యతగా తీసుకోవాలన్నారు. దేశంలో ఎవరికి వారు శుభ్రత పాటిస్తే శానిటేషన్ అవసరం ఉంటుందా? అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరు ఈ అంశంపై ఆలోచించాలన్నారు. స్వచ్ఛత పాటించకుండా.. ఎవరికి వారు భాధ్యత లేకుండా ఉంటే దేశం ఎప్పటికీ బాగుపడదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
For Telangana News And Telugu News...