ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uttam : మూసీ ప్రక్షాళనకు అందరూ మద్దతివ్వాలి: ఉత్తమ్‌

ABN, Publish Date - Oct 05 , 2024 | 03:29 AM

నిజాం కాలంలో నిర్మించిన మూసీనది ప్రక్షాళనకు అన్ని వర్గాలు మద్దతు పలకాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు.

మఠంపల్లి, అక్టోబరు 4: నిజాం కాలంలో నిర్మించిన మూసీనది ప్రక్షాళనకు అన్ని వర్గాలు మద్దతు పలకాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు. కాలుష్య భరిత మూసీని పునరుజ్జీవం చేసేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని అన్ని పార్టీల నేతలు, అన్ని వర్గాల వారు ఆహ్వానించాలన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలకు జీవనాధారమైన మూసీనదిని దశాబ్దాలుగా ప్రక్షాళన చేయకపోవడంతో కాలుష్య కోరల్లో చిక్కుకుందన్నారు.


నది ప్రక్షాళన తర్వాత మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నుంచి 2 టీఎంసీల నీటిని గండిపేటకు, అక్కడి నుంచి మూసీ నదిలోకి తీసుకొస్తామని చెప్పారు. అంతకుముందు తండ్రి పురుషోత్తంరెడ్డి అస్థికలను కృష్ణానదిలో మంత్రి ఉత్తమ్‌ నిమజ్జనం చేశారు. మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ప్రవహిస్తున్న కృష్ణానదిలో వేద పండితుల ఆధ్వర్యంలో కుటుంబసభ్యులతో కలసి శాస్ర్తోక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - Oct 05 , 2024 | 03:29 AM