ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uttam: సమ్మక్క సారక్క ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ఛత్తీస్‌గఢ్‌ను ‌ఒప్పించండి

ABN, Publish Date - Dec 23 , 2024 | 03:25 AM

సమ్మక్క-సారక్క ప్రాజెక్టు నిర్మాణానికి ఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వాన్ని ఒప్పించాలని, ఇందుకోసం ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులకు సూచించారు.

  • అధికారులకు మంత్రి ఉత్తమ్‌ ఆదేశాలు

హైదరాబాద్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): సమ్మక్క-సారక్క ప్రాజెక్టు నిర్మాణానికి ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాన్ని ఒప్పించాలని, ఇందుకోసం ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులకు సూచించారు. ఆదివారం ఉదయం జలసౌధలో ఆయన శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమ్మక్క-సారక్క ప్రాజెక్టు విషయంలో కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) లేవనెత్తిన అంశాలను సత్వరమే నివృత్తి చెయ్యాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టు కారణంగా ఛత్తీస్‌గఢ్‌లో ముంపు సమస్యను పరిష్కరించడానికి వీలుగా చెల్లించబోయే నష్టపరిహారంపై ఆ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు.


ఆరు లక్షల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణను 2025 మార్చి నాటికి పూర్తి చేయాలన్నారు. అలాగే.. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులపై జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) నుంచి తుది నివేదికను త్వరితగతిన తెప్పించాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఆనకట్టలు, కాలువల భద్రతకు అవసరమైన 1800 మంది లష్కరుల ని యామకాలు వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్‌ సూచించారు. దీనిపై ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా స్పందిస్తూ.. ఈ ప్రక్రియను ఇప్పటికే పూర్తిచేశామని, ఆర్థికశాఖ అనుమతులు పొందాల్సి ఉందని చెప్పారు.

Updated Date - Dec 23 , 2024 | 03:25 AM