ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vemula Veeresham: కేసీఆర్‌తో కుమ్మక్కై జగదీశ్‌రెడ్డి అక్రమాలు..

ABN, Publish Date - Jul 01 , 2024 | 03:19 AM

మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కుమ్మకై విద్యుత్తు రంగంలో భారీ అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. విద్యుత్తు కొనుగోళ్లలో అవినీతి జరగలేదని చెబుతున్న జగదీశ్‌ రెడ్డి.

  • విద్యుత్తులో భారీ అవినీతి: వీరేశం

  • నేడు విద్యార్థి, యువజన సంఘాల రాజ్‌భవన్‌ ముట్టడి

కట్టంగూరు/హైదరాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కుమ్మకై విద్యుత్తు రంగంలో భారీ అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. విద్యుత్తు కొనుగోళ్లలో అవినీతి జరగలేదని చెబుతున్న జగదీశ్‌ రెడ్డి.. దమ్ముంటే తన నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. ఆదివారం నల్లగొండ జిల్లా కట్టంగూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి విద్యుత్తు కొనుగోళ్ల కోసం రూ.10 వేల కోట్ల అప్పు చేశారన్నారు. ఛత్తీ్‌సగఢ్‌ విద్యుత్తు కొనుగోళ్లలో ఎలాంటి అవినీతి జరగలేదని, జ్యుడీషియల్‌ కమిషన్‌ వేయాలని అసెంబ్లీ సాక్షిగా కోరిన జగదీశ్‌రెడ్డి.. ప్రభు త్వం కమిషన్‌ వేయగానే విచారణకు హాజరు కాకుం డా తప్పించుకుని తిరుగుతున్నారని ఆయన విమర్శించారు.


అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్‌ రావు.. ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు నిరుద్యోగులను పరామర్శిస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌గౌడ్‌ ప్రశ్నించారు. ఆనాడు ఉద్యోగాలడిగితే హమాలీ పనులు చేసుకోవాలంటూ బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడారని, నిరుద్యోగం అనే పదం పలికే నైతికత కూడా వారికి లేదని ఓ ప్రకటనలో మండిపడ్డారు. కాగా, నీట్‌ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం రాజ్‌భవన్‌ను ముట్టడించనున్నట్లు విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కమిటీ ప్రకటించింది. ఎన్‌ఎ్‌సయూఐ, ఎస్‌ఎ్‌ఫఐ, ఏఐఎ్‌సఎఫ్‌, పీడీఎ్‌సయూ తదితర విద్యార్థి సంఘాల నేతలు ఇందులో పాల్గొననున్నట్లు తెలిపింది.


కొత్త ఒరవడితో ముందుకు..: చిన్నారెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి చైర్మన్‌గా ఉన్న ప్రణాళికా సంఘం.. కొత్త ఒరవడితో ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతోందని ఆ సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి అన్నారు. ఖైరతాబాద్‌లోని అర్థగణాంక శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆ శాఖ డైరెక్టర్‌ దయానంద్‌ పదవీ విరమణ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

Updated Date - Jul 01 , 2024 | 03:19 AM

Advertising
Advertising