ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ మెరుపు దాడులు

ABN, Publish Date - Dec 20 , 2024 | 06:11 AM

మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం నందిగామ రైస్‌మిల్‌పై గురువారం రాత్రి విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం మెరుపు దాడులు చేపట్టింది. దీనిలో భారీగా పీడీఎస్‌ (రేషన్‌ బియ్యం) నిల్వలు గుర్తించారు.

  • 300 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

రామాయంపేట, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం నందిగామ రైస్‌మిల్‌పై గురువారం రాత్రి విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం మెరుపు దాడులు చేపట్టింది. దీనిలో భారీగా పీడీఎస్‌ (రేషన్‌ బియ్యం) నిల్వలు గుర్తించారు. రాత్రి 9 గంటల వరకు సుమారు 700 పైచిలుకు బస్తాలు, 300 క్వింటాళ్లకుపైగా బియ్యం నిల్వలు లెక్కించారు. ఇంకా తనిఖీలు కొనసాగిస్తున్నారు. పట్టుబడ్డ బియ్యాన్ని లారీల్లో లోడ్‌ చేసి నిజాంపేట పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నారు. పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యం రైస్‌ మిల్లుల్లో చేరుతుండటంతో ఇటీవల పోలీసు, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఉన్నతాధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా సాయంత్రం అందిన సమాచారంతో అధికారుల బృందం రంగంలోకి దిగింది. విజిలెన్స్‌ అదనపు ఎస్పీ ద్రోణాచార్య నేతృత్వంలో డీఎం హరికృష్ణ, ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలతో పాటు స్థానికి తహశీల్దార్‌ల బృందం ఈ దాడులు చేసింది.

Updated Date - Dec 20 , 2024 | 06:11 AM