Congress: చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సునీతారెడ్డి!
ABN , Publish Date - Feb 16 , 2024 | 05:46 AM
పార్లమెంట్ ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్ పార్టీ చేరికలను ముమ్మరం చేసింది. బీఆర్‌ఎ్‌సకు మంచి పట్టున్న ఉమ్మడి రంగారెడ్డి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై కాంగ్రెస్ ఫోకస్..
నేడు హస్తం గూటికి వికారాబాద్ జడ్పీ చైర్‌పర్సన్ ’
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా సునీతారెడ్డి!
హైదరాబాద్/రంగారెడ్డి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): పార్లమెంట్ ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్ పార్టీ చేరికలను ముమ్మరం చేసింది. బీఆర్‌ఎ్‌సకు మంచి పట్టున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై ఫోకస్ పెట్టింది. ప్రధాన ప్రతిపక్షమైన గులాబీ పార్టీని కోలుకోలేని దెబ్బ తీసేందుకు వ్యూహరచన మొదలు పెట్టింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కుటుంబానికి గాలం వేసింది. మహేందర్‌రెడ్డితోపాటు ఆయన సతీమణి, వికారాబాద్ జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి ఇటీవలే సీఎం రేవత్‌రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. సునీతారెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో వారి కుటుంబం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైంది. తెలంగాణ పునర్‌నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సునీతారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
శుక్రవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో జడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డి, వారి కుమారుడు రినీ్‌షరెడ్డిలు తమ అనుచరులతో కలిసి కాంగ్రె్‌సలో చేరనున్నారు. ఉమ్మడి జిల్లాలోని బీఆర్‌ఎ్‌సకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సునీతారెడ్డితో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మహేందర్‌రెడ్డి నివాసం నుంచి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే సునీతారెడ్డి వరుసగా మూడోసారి జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. రెండుసార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేయగా, ప్రస్తుతం వికారాబాద్ జడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఈ కారణంగానే ఆమెకు చేవెళ్ల ఎంపీ సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా వీరితోపాటు జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన సతీమణి, చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఒకరు నేడు కాంగ్రె్‌సలో చేరనున్నట్లు తెలుస్తోంది.
నిజామాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు షాక్
బోధన్ రూరల్, ఫిబ్రవరి 15: నిజామాబాద్ జిల్లాలో బీఆర్‌ఎ్‌సకు షాక్ తగిలింది. నిజామాబాద్ జడ్పీ వైస్ చైర్‌పర్సన్ రజిత యాదవ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం హైదరాబాద్‌లో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.