ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Manchu Family Disputes: అతని వల్లే మా ఇంట్లో గొడవలు.. రివీల్ చేసిన మనోజ్..

ABN, Publish Date - Dec 11 , 2024 | 02:38 PM

Manchu Manoj vs Mohanbabu Controversy: ఫ్యామిలీ వివాదం నేపథ్యంలో.. మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ రాచకొండ సీపీ కార్యాలయానికి వచ్చారు. సీపీ ముందు వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు.

Manchu Manoj vs Mohanbabu Controversy: ఫ్యామిలీ వివాదం నేపథ్యంలో.. మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ రాచకొండ సీపీ కార్యాలయానికి వచ్చారు. సీపీ ముందు వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు. గొడవలకు సంబంధించి కీలక వివరాలను సీపీకి మనోజ్ వివరించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన మనోజ్.. మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కూర్చుని సమస్యను పరిష్కరించుకునేందుకు తాను సిద్ధం అని ప్రకటించారు. తిరుపతి అభివృద్ధి చెందాలని నాన్న(మోహన్‌బాబు) స్కూల్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అయితే, తమ బంధువు వినయ్ వైఖరితోనే తమ ఇంట్లో వివాదాలు చోటు చేసుకుంటున్నాయని మనోజ్ ఆరోపించారు. తన అమ్మ ఆరోగ్యం బాగానే ఉందని.. ఆస్పత్రిలో లేరన్నారు. ఇంట్లో ఉన్నారని చెప్పారు.


మనోజ్ ఏమన్నారంటే..

‘శాంతియుతంగా సమస్య పరిష్కారం చేసుకోవడానికి నేను సిద్ధం మా అమ్మ హాస్పిటల్లో ఉందని అబద్ధాలు ఆడారు నా తల్లి జల్ పల్లిలోని నివాసంలోనే ఉన్నారు. విద్యానికేతన్‌లో జరిగిన అక్రమాలపైన ప్రశ్నించడంతోనే నన్ను టార్గెట్ చేశారు. మరోసారి శాంతిభద్రతలు విఘాతం కలిగించవద్దని సీపీ ఆదేశించారు. నేను మరోసారి ఎవరితో, ఎలాంటి గొడవలు పడడం గానీ.. శాంతి భద్రతలు విఘాతం కలిగించడం కానీ చేయనని సీపీకి హామీ ఇచ్చాను. నేను ఫిర్యాదు చేసిన కేసులో ఒకరిని ఇప్పటికే అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. అతన్ని కూడా కస్టడీలోకి తీసుకొని విచారణ జరపాలని సీపీని కోరారు. తానిచ్చిన ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని సీపీని కోరాను. మా నాన్న దేవుడు మా నాన్నను కొంతమంది ప్రభావితం చేస్తున్నారు.’


మనోజ్‌ను హెచ్చరించిన సీపీ..

ఇదిలాఉంటే.. ఫ్యామీ వివాదం నేపథ్యంలో మంచు మనోజ్‌కు సీపీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి శాంతి భద్రతలకు విగాథం కలిగేలా వ్యవహరించొద్దని సీపీ వార్నింగ్ ఇచ్చారు. ఏడాది వరకు ఎలాంటి గొడవలు గానీ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం గానీ చేయొద్దని స్పష్టం చేశారు. అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాలో సీపీ ఈ దేశాలిచ్చారు. ఒకవేళ ఎలాంటి ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసినా.. లక్ష రూపాయల జరిమానా ఉంటుందని సీపీ హెచ్చరించారు.


Also Read:

మంచు ఫ్యామిలీ వివాదం.. సీపీ సీరియస్‌ వార్నింగ్..!

అమ్మ బాధలో ఉంది.. లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు

For More Telangana News and Telugu News..

Updated Date - Dec 11 , 2024 | 02:38 PM