Ayodhya: వరంగల్ నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్స్
ABN, Publish Date - Jan 19 , 2024 | 10:01 AM
అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. రైల్వేశాఖ స్పెషల్ ట్రైన్స్ నడిపిస్తోంది. వరంగల్, కాజీపేట నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్స్ వేశారు.
వరంగల్: అయోధ్యలో రామ్‌లల్లా (Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. దీంతో రైల్వేశాఖ స్పెషల్ ట్రైన్స్ (Special Trains) నడిపిస్తోంది. వరంగల్, కాజీపేట నుంచి అయోధ్యకు స్పెషల్ ట్రైన్స్ వేశారు. ప్రతి సోమవారం వరంగల్ నుంచి ‘శ్రద్దా సేత్’ రైలు అయోధ్యకు వెళుతుంది. ప్రతి శుక్రవారం కాజీపేట నుంచి యశ్వంత్ పూర్- గోరఖ్ పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు అయోధ్య ప్రయాణిస్తోంది. ఈ రైళ్లలో జనరల్ టికెట్ ధర రూ.400 కాగా, స్లీపర్ క్లాస్ ధర రూ.658గా నిర్ణయించారు. ఈ నెల 30వ తేదీ నుంచి స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 19 , 2024 | 01:36 PM