BRS: కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు!.. రంగంలోకి దిగిన హరీష్‌రావు
ABN, Publish Date - Mar 09 , 2024 | 01:12 PM
Telangana: పెద్ద ఎత్తున నేతలు బీఆర్ఎస్ను వీడటం ఆ పార్టీలో తీవ్ర కలవరాన్ని రేపుతోంది. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్‌లోకి జంప్ అవగా.. తాజాగా ఆరుగురు బీఆర్‌ఎస్ జీడబ్ల్యూఎంసీ కార్పొరేటర్లు బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఈ ఆరుగురు కార్పొరేటర్లు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారనే వార్త హల్‌చల్ చేస్తోంది. వర్థన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును ఈ ఆరుగురు కార్పొరేటర్లు కలిసినట్లు తెలుస్తోంది.
వరంగల్, మార్చి 9: పెద్ద ఎత్తున నేతలు బీఆర్ఎస్ను (BRS) వీడటం ఆ పార్టీలో తీవ్ర కలవరాన్ని రేపుతోంది. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్‌లోకి జంప్ అవగా.. తాజాగా ఆరుగురు బీఆర్‌ఎస్ జీడబ్ల్యూఎంసీ కార్పొరేటర్లు (BRS Corporators) పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఈ ఆరుగురు కార్పొరేటర్లు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లోకి (Congress) వెళ్తున్నారనే వార్త హల్‌చల్ చేస్తోంది. వర్థన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును (MLA KR Nagaraju) ఈ ఆరుగురు కార్పొరేటర్లు కలిసినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన అధిష్టానం చర్యలకు దిగింది. కార్పొరేటర్లు కాంగ్రెస్‌కు వెళ్లకుండా మాజీ మంత్రి హరీష్‌రావు (Harish Rao) రంగంలోకి దిగారు. కార్పొరేటర్లకు ఫోన్ చేసి మాట్లాడి బుజ్జగించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తు మనదే, కలిసి పనిచేద్దామని మాజీ మంత్రి కోరినట్లు తెలుస్తోంది. అయితే హరీష్‌రావు బుజ్జగించినప్పటికీ ఒకరిద్దరు మినహా మిగిలిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వర్ధన్నపేట ఎమ్మెల్యేను కలిసిన వారిలో 1వడివిజన్, అరుణ కుమారి, 14వ డివిజన్ తూర్పాటి సులోచన, 43వ డివిజన్ ఈదురు అరుణ, 55వ డివిజన్ జక్కుల రజిత, 64వ డివిజన్ ఆవాల రాధిక రెడ్డి, 65వ డివిజన్ గుగులోత్ దివ్యరాణి ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
BRS: వరుసగా బీఆర్‌ఎస్‌ను వీడుతున్న నేతలు..
TDP-Janasena-BJP: షాతో ముగిసిన చంద్రబాబు, పవన్‌ల భేటీ.. ఎవరికి ఎన్ని సీట్లంటే..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Mar 09 , 2024 | 01:12 PM