ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సుప్రీంకోర్టు కల్పించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు?

ABN, Publish Date - Aug 22 , 2024 | 02:50 PM

Telangana: సీపీఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కళ్లపెల్లి శ్రీనివాస్ హాజరయ్యారు.

CPI National General Secretary D Raja

హనుమకొండ, ఆగస్టు 22: సీపీఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కళ్లపెల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా మాట్లాడుతూ.. మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికి మోడీ కానీ... 400 స్థానాలతో అధికారం లోకి వస్తామని చెప్పి 250లోపు స్థానాలకే పరిమితమయ్యారు.

Sithakka: అదానీ అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి


చంద్రబాబు, నితీష్ కుమార్‌పై ఆధార పడి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందన్నారు. కార్పొరేట్ కంపెనీల కోసమే బడ్జెట్ పెట్టిందని విమర్శించారు. పేదల కోసం ఎలాంటి అవకాశం కల్పించలేదన్నారు. దేశంలో నిరుద్యోగ శాతం పెరుగుతోందని.. బడ్జెట్‌లో విద్య, వైద్యం కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదని విమర్శించారు. అభివృద్ధి చెందిన దేశంగా భరత్ మారిందని చెబుతూనే రేషన్ ఉచితంగా ఇచ్చే పరిస్థితి ఎందుకు ఉందో చెప్పాలని ప్రశ్నించారు. సెబీ, ఇండెన్ బర్గ్, ఆదాని కంపెనీలపై మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. విచారణ కోసం కమిటీ ఎందుకు వేయడం లేదని అడిగారు. బెంగాల్‌లో చోటు చేసుకున్న ఘటనపై మోడీ మౌనం విడాలన్నారు. దేశంలో మహిళలపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయన్నారు. సుప్రీం కోర్ట్ కల్పించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు.


మహిళల రక్షణ కోసం పటిష్టమైన చట్టాలు రావాలని... పకడ్బందీగా అమలు చేయాలన్నారు. రిజర్వేషన్, సామజిక న్యాయం వంటి వాటిని ఎత్తి వేయాలని మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శలు గుప్పించారు. ప్రైవేటు సెక్టార్‌లోనూ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ రాజ్యాంగంపై ప్రత్యక్షంగా దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. ఆదాని, అంబానీలకు బీజేపీ ప్రభుత్వం కొమ్ము కాస్తోందన్నారు. ఒకే దేశం ఒకే ఎలెక్షన్, ఒకే రిలీజీయాన్ అనే నినాదంతో దేశంలో విచ్చిన్న పాలన సాగించాలని చూస్తోందన్నారు. రాజ్యాంగం ప్లేస్‌లో కొత్త మతతత్వ రాజ్యాంగం తేవాలని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ చూస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్య పార్టీలతో కలిసి రాజ్యాంగ రక్షణ కోసం ముందుకు వెళ్తామన్నారు. నిత్యం రామ జపం చేసే బీజేపీకి రామ ప్రదేశంలో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారన్నారు.


దేశం ప్రజాస్వామ్య దేశం అనేది మోడీ గుర్తించాలన్నారు. జమ్మూ, హర్యానాలో జరగబోయే ఎన్నికలలో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పడానికి నిర్ణయం తీసుకున్నారన్నారు. కాశ్మీర్‌లో శాంతి భద్రతలు రక్షించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యలు చేశారు. వినేష్ పొగట్ ఒలింపిక్‌లో గోల్డ్ మెడల్ తెచ్చేవారని... బీజేపీ కుట్రలలో బలైపోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తా అని చెప్పిందని... ఎందుకు ఆలస్యం చేస్తోందని అడిగారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని.. వాటిని అమలు చేయాలని డి.రాజా డిమాండ్ చేశారు.

Chandrababu: ఫార్మా కంపెనీలో జరిగిన ఘటన తీవ్రంగా కలచివేసింది


కూనంనేని సాంబ శివరావు మాట్లాడుతూ.. చైతన్య వంతంగా పార్టీని బలోపేతం చేయడానికి కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. డిసెంబర్ 25 నాటికి సీపీఐ వందేండ్లు పూర్తి చేసుకుంటుందని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో నిర్మాణంపై దృష్టిసారించామన్నారు. బీఆర్‌ఎస్ సృష్టించిన సంక్షోభం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బయటపడలేకపోతోందన్నారు. రుణమాఫీ వందశాతం అమలు కాలేదని ప్రజల నుంచి వినిపిస్తుందని తెలిపారు. ప్రజా వ్యతిరేకతను మూట కట్టుకోవద్దని కోరుకుంటున్నామన్నారు. బీఆర్‌ఎస్ పనిఅయిపోయిందన్నారు. బీజేపీని నిలువరించడంతో పాటు సీపీఐ బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు పాలనసాగని పక్షంలో పోరాటం చేస్తామని కూనంనేని వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

TG News:10 ఐ ఫోన్లను ఆ కొరియర్ బాయ్ ఏం చేశాడో తెలుసా!

Konda muarali: బస్వరాజు సారయ్యపై కొండా మురళి ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 22 , 2024 | 03:22 PM

Advertising
Advertising
<